ఫ్రైడే ఓటీటీ మూవీస్.. ఒక్క రోజులోనే 14 సినిమాలు!
శుక్రవారం వచ్చిందంటే చాలు ఏ కొత్త సినిమాకి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వస్తుందో అని తెలుసుకోవడానికి ఓటీటీ లవర్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
శుక్రవారం వచ్చిందంటే చాలు ఏ కొత్త సినిమాకి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వస్తుందో అని తెలుసుకోవడానికి ఓటీటీ లవర్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఓటీటీలో విభిన్నమైన జానర్లలో సినిమాలు అందుబాటులోకి వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఏకంగా 14 సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయాయి. టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్, పోలీస్ కంప్లైంట్, లవ్ ఓ లవ్ వంటి చిత్రాలతో పాటు ఎన్నో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయనున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా అందుబాటులోకి వచ్చింది.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
నెట్ ఫ్లిక్స్..
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ వారం ఏకంగా పలు చిత్రాలు , సిరీస్ లతో పాటు డబ్బింగ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయింది. అందులో భాగంగానే హీరో సత్యదేవ్ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రావు బహదూర్ జూలై 31న అందుబాటులోకి రాగా.. విష్ణు విశాల్ హీరోగా నటించిన గట్టకుస్తీ సినిమా సీక్వెల్ గట్టకుస్తీ 2 తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా నేడు స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే జపనీస్ సిరీస్ ఆవోసీ ఆగస్టు 1న స్ట్రీమింగ్ కి రానుండగా , అదే రోజు హాలీవుడ్ సిరీస్ చికాగో పీడీ కూడా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 2వ తేదీన మైకేల్ పెంబూరు దువా ఆలమ్ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.
అమెజాన్ ప్రైమ్..
మరో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే.. ఈరోజు ఒక్కరోజే ఏకంగా రెండు చిత్రాలు, ఒక సిరీస్ అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్గా పరిచయమవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ ఓ లవ్ తమిళ చిత్రం, తెలుగు డబ్బింగ్ వర్షన్ నేడు స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే తెలుగు స్ట్రైట్ మూవీ పోలీస్ కంప్లైంట్ కూడా నేడు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. ఈ రెండు చిత్రాలతో పాటు ఇంగ్లీష్ సిరీస్ బ్యాట్ మన్ : కెప్ట్ క్రూసేడర్ సీజన్ 2 నేడు స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
జియో హాట్ స్టార్:
ప్రముఖ ఓటీటీ దిగ్గజాలలో ఒకటిగా పేరు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్ లో హిందీ రియాలిటీ సిరీస్ భోజ్ పురి భవాల్ ఆగస్టు 2వ తేదీన స్ట్రీమింగ్ కి రాబోతోంది. అయితే ఈ వారం తెలుగు సినిమాలు లేకపోవడంతో కాస్త అభిమానులు పాత సినిమాలనే రిపీట్ గా చూస్తున్నారు.
ఆహా:
తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలో దీవానా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
జీ 5 :
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ పాపులారిటీ అందుకున్న బాలన్ ది బాయ్ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ నేడు జి5 వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అలాగే తెలుగు సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ కూడా స్ట్రీమింగ్ కి రాగా .. అటు ఇదే రోజు హిందీ సినిమా హై జవానీతో ఇష్క్ హోనా హై కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అలాగే తెలుగు డబ్బింగ్ మూవీ వందదేవుళ్ళు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
సోనీ లైవ్ లో హిందీ సిరీస్ ద లెజెండ్ ఆఫ్ కర్ణ స్ట్రీమింగ్ కి రాగా.. సన్ నెక్స్ట్ లో మలయాళ సినిమా పైతాలట్టం స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ వారాంతం మీకు నచ్చిన సినిమాని ఫ్యామిలీతో కలిసి వీక్షిస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.