ఓటీటీ చిత్రాలకు సెన్సార్ తప్పనిసరా.. కేంద్రం కీలక నిర్ణయం!
ఓటీటీల్లో వస్తున్న అశ్లీలత, వివాదాస్పద కంటెంట్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సరికొత్త నిబంధనలను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక బిగ్ షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు సెన్సార్ ఆంక్షలు లేకుండా స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ సినిమాలకు ఇకపై సెన్సార్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేసేలా కేంద్రం అడుగులు వేస్తోంది. ఓటీటీల్లో వస్తున్న అశ్లీలత, వివాదాస్పద కంటెంట్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సరికొత్త నిబంధనలను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో వెబ్ సిరీస్‌లను కూడా దీని పరిధిలోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు చూద్దాం..
థియేటర్ సినిమాలు సెన్సార్ కట్‌కు లోబడతాయి, కానీ ఓటీటీ కంటెంట్ మాత్రం ఇప్పటివరకు అలాంటి నియమాల నుంచి బయటే ఉంది. దీనివల్ల డైరెక్టర్లు తమకు నచ్చినట్టు బోల్డ్ సీన్లు, బూతులు, హింసను చూపిస్తూ వచ్చారు. అయితే రోజురోజుకూ ఈ కంటెంట్ శృతిమించుతుండటంతో కేంద్ర సమాచార ప్రసార శాఖ దీనిపై సీరియస్ అయింది. ఇక ఓటీటీ సినిమాలకు కూడా రిలీజ్‌కు ముందే పర్మిషన్ తీసుకోవాలనే రూల్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
వివాదాస్పద కంటెంట్‌కు బ్రేక్:
ఇటీవల కొన్ని ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల వల్ల శాంతిభద్రతల సమస్యలు, మతపరమైన వివాదాలు తలెత్తాయి. అందుకే డిజిటల్ కోడ్ నిబంధనల ద్వారా వయసు పరిమితులు కంటెంట్ డిస్క్రిప్టర్లను మరింత కఠినతరం చేయాలని చూస్తున్నారు. ఇక సమాజంపై, ముఖ్యంగా పిల్లలపై చెడు ప్రభావం చూపే సీన్లను నియంత్రించడమే కేంద్రం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
వెబ్ సిరీస్‌లకూ కష్టాలు మొదలేనా?:
కేవలం సినిమాలకే కాకుండా, ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్‌లను కూడా ఈ సరికొత్త సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇప్పటివరకు ఐటీ రూల్స్ ప్రకారం కేవలం సెల్ఫ్ రెగ్యులేషన్ మాత్రమే అమల్లో ఉండేది.. కానీ ఇకపై అలా కుదరదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫిల్టర్ అయ్యాకే అవి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుంది.
క్రియేటర్స్ ఆందోళన:
కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, సినీ క్రియేటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీటీ అనేది పర్సనల్ డివైజ్‌లలో చూసే వినోదమని, థియేటర్ల లాంటి పబ్లిక్ ప్లేస్ కాదని వారు వాదిస్తున్నారు. ఇక ఇలాంటి కఠినమైన సెన్సార్ ఆంక్షలు పెడితే తమ క్రియేటివ్ ఫ్రీడమ్ దెబ్బతింటుందని, కథలను స్వేచ్ఛగా చెప్పలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వినోదంతో పాటు సామాజిక బాధ్యత కూడా ముఖ్యమేనని కేంద్రం భావిస్తుంటే, భావప్రకటన స్వేచ్ఛను హరించవద్దని క్రియేటర్స్ కోరుతున్నారు. ఇక ఏదేమైనా ఓటీటీ సెన్సార్‌పై కేంద్రం వేస్తున్న ఈ అడుగులు డిజిటల్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. మరి ఈ కొత్త రూల్స్ వల్ల ఓటీటీ కంటెంట్ క్వాలిటీ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది భవిష్యత్తులోనే తెలుస్తుంది.