ఈ వారం ఏం చూడాలి? OTT రిలీజ్‌ల ఫుల్ లిస్ట్ ఇక్కడే!

ఇక రీసెంట్‌గా వచ్చిన 'జియో హాట్‌స్టార్' లో మలయాళ డార్క్ కామెడీ 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు ఆడియోతో సహా స్ట్రీమింగ్ అవుతోంది.

Update: 2026-07-04 10:28 GMT

సినిమా ప్రియులకు ఈ వీకెండ్ ఓటీటీలో అసలైన పండగ వచ్చేసింది. థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోయినా.. ఇంట్లోనే కూర్చుని బోర్‌ కొట్టకుండా చూసేందుకు డిఫరెంట్ జోనర్లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం సహా హాలీవుడ్ చిత్రాలు కూడా క్యూ కట్టాయి. మరి ఈ వారం మీ వీకెండ్ ప్లాన్స్ కోసం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ తెలుగు కంటెంట్ మరియు ఇతర ముఖ్యమైన సినిమాల లిస్ట్ ఇక్కడే చూసేయండి..

ఈటీవీ విన్‌లో సరికొత్త తెలుగు కంటెంట్:

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'ఈ వారం వైవిధ్యమైన కంటెంట్‌తో ముందుకొచ్చింది. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఒక ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ రైడ్‌తో 'గుర్తుకొస్తున్నాయి' సీజన్ 1 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దీనితో పాటు సస్పెన్స్ ఇష్టపడే వారి కోసం 'డిజిటల్ డెత్' అనే సినిమా కూడా అందుబాటులోకి వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు నవ్వులు.. థ్రిల్లర్లు:

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ వీకెండ్ గట్టిగానే ప్లాన్ చేసింది. తెలుగుతో పాటు మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన 'సూపర్ సుబ్బు'సిరీస్ ఫుల్ కామెడీ అండ్ డ్రామాతో నవ్విస్తోంది. థ్రిల్లర్ ఇష్టపడే వారి కోసం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'ఎనోలా హోమ్స్ 3' క్రైమ్ థ్రిల్లర్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాక హిందీ కామెడీ డ్రామా దాదీ కీ షాదీ, హారర్ చిత్రం 'కంపానియన్'లతో పాటు 'సమ్మర్ 36', 'హ్యూమన్ వేపర్' వంటి మిస్టరీ, యాక్షన్ సిరీస్‌లు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 'లవ్ ఈజ్ బ్లైండ్ అర్జెంటీనా', 'వర్స్ట్ నైబర్ ఎవర్' వంటి రియాలిటీ, డాక్యుమెంటరీ షోలు కూడా వచ్చాయి.

ప్రైమ్ వీడియోలో యాక్షన్ అండ్ మిస్టరీ:

అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ వారం అదిరిపోయే సినిమాలను తీసుకొచ్చింది. పక్కా యాక్షన్ ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కోసం 'రేజర్' యాక్షన్ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అలాగే కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్' మరియు సైన్స్ ఫిక్షన్ ఇష్టపడే వారి కోసం తెలుగు ఆడియోతో 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' సినిమా దుమ్ములేపుతున్నాయి. ఇక దీనితో పాటు 'ఇసకపట్నం' అనే పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్ మరియు జీ5 సందడి:

ఇక రీసెంట్‌గా వచ్చిన 'జియో హాట్‌స్టార్' లో మలయాళ డార్క్ కామెడీ 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు ఆడియోతో సహా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే హిందీ, తెలుగు భాషల్లో 'ప్రీతమ్ అండ్ పెడ్రో' క్రైమ్ కామెడీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇక మరోవైపు జీ5 లో 'వీరభద్రుని రహస్యం' అనే తెలుగు వీక్లీ సిరీస్ మరియు సన్‌నెక్స్ట్ లో 'హ్యాంగ్‌మ్యాన్' అనే యాక్షన్ డ్రామా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

మొత్తానికి ఈ వీకెండ్ చిన్న సినిమాలతో పాటు మంచి మంచి వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మీరు గనుక పక్కా కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే 'సూపర్ సుబ్బు', 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్‌లను చూసేయొచ్చు. లేదు మాకు కొంచెం సస్పెన్స్, యాక్షన్ కావాలనుకుంటే 'రేజర్', 'ఇసకపట్నం' లాంటి సినిమాలను మీ వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీ ఫేవరెట్ ఓటీటీ యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి..

Tags:    

Similar News