ఓ రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన సింగ్ గీతం.. ఆడియ‌న్స్ కు సర్‌ప్రైజ్!

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Update: 2026-07-08 07:46 GMT

ప్రయోగాత్మక కథలతో తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా సినిమా సింగ్ గీతం డిజిటల్ ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రావడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన ఆడియ‌న్స్ కు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం లభించింది.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి ఐదు భారతీయ భాషల్లో రిలీజ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా మరింత విస్తృత ఆడియ‌న్స్ ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన కొన్నాళ్ల‌కే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి రావడం కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

94 ఏళ్ల వయసులో కూడా కొత్త ఆలోచనలతో సినిమా రూపొందించిన సింగీతం శ్రీనివాసరావు మరోసారి తన క్రియేటివిటీను చాటుకున్నారు. మ్యూజిక్, ఫాంటసీ, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలను వినూత్నంగా మేళవించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంది. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా రూపొందిన ఈ సినిమా కథనం, విజువల్ ప్రెజెంటేషన్, సంగీత వినియోగం ప్రత్యేకంగా నిలిచాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సింగ్ గీతం సినిమాను డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ నిర్మించగా, కొత్త నటీనటులు అయాన్, అహల్య ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు షాలినీ కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే స్పెష‌ల్ రోల్స్ లో కనిపించిన రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్, విజయ్ దేవరకొండ తెరపై కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, పాటలు, నేపథ్య సంగీతం మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. కథలో భాగంగానే సంగీతాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కథానుగుణంగా రూపొందిన సంగీత విన్యాసాలు ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణను అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఒక రోజు ముందుగానే డిజిటల్ రిలీజ్ చేయడం ద్వారా సింగ్ గీతం మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News