• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10:...

Bigg Boss Telugu 10: హౌస్‌లోకి ఆ ఐదుగురు.. ఇక అసలు ఆట మొదలు..!

| ఇప్పటికే స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకను స్పష్టం చేసింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-10-10 16:36 GMT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ప్రస్తుతం ఆట ఆసక్తికరంగా నడుస్తోంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తవుతున్న సమయంలో హౌస్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వాదనలు, టాస్కులతో షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే షోపై మరింత ఆసక్తి పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక రేపటి నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి ఈ షో పై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తోంది.

ఇప్పటికే స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకను స్పష్టం చేసింది. దీంతో కొత్తగా హౌస్‌లోకి ఎవరు వస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈసారి ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి రాకతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఆటతీరు మారే అవకాశం ఉంది. చాలామంది ఇప్పటికే ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్ వాళ్లు ఆల్రెడీ కొంత షో చూసి వస్తుంటారు కాబట్టి.. వాళ్ల స్ట్రాటజీ వల్ల పాత వాళ్ళు కూడా ప్రభావితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

కొత్తవాళ్లు రావడంతో పోటీ మరింత పెరగడంతో పాటు హౌస్‌లో కొత్త గొడవలు కూడా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో కొన్ని పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. సీరియల్ నటుడు శివకుమార్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, కొరియోగ్రాఫర్ నీతూ నటరాజ్, అగ్ని పరీక్ష షోలో పాల్గొన్న రామకృష్ణ, నటి దక్షి గుట్టికొండ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా హౌస్‌లోకి వస్తారా లేదా అనే విషయం ఇంకా కచ్చితంగా తెలియదు.

మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే ఊహాగానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఒకరిని ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా బయటకు పంపించగా, మరొకరిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల అభిప్రాయాల ఆధారంగా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో షాలిని లేదా అపూర్వలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. అయితే మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్‌కు బదులుగా ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేసి మరొకరిని సీక్రెట్ రూమ్‌కు పంపించవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని పెంచుతున్నప్పటికీ, షోపై మరింత క్రేజ్ తీసుకురావడానికి కొత్తవాళ్ల రాక కీలకంగా మారనుంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. మొత్తానికి కొత్తవాళ్లు వస్తే ఈ షో పైన మరింత ఇంట్రెస్ట్ పెరగడం మాత్రం ఖాయమని చెప్పాలి.

Tags:    
  • biggbosstelugu10 
  • biggbosstelugu 
  • wildcardentries 
  • doubleelimination 

Similar News

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ కొత్త అడ్డా.. 'మెగావర్స్' ప్రోమోతో అసలు విషయం చెప్పేసిన చిరంజీవి!

2026-11-24 08:29 GMT

నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌పై భర్త ఫైర్.. పూరీ, అలీకి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

2026-11-24 06:32 GMT

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

భారీ అంచనాలతో వచ్చి.. నెలలోనే ఓటీటీ బాట!

2026-11-22 11:35 GMT

Bigg Boss Telugu 10: వంశీ మాటలపై తల దించుకుంటున్నానని చెప్పిన నాగార్జున

2026-11-22 10:39 GMT

Bigg Boss Telugu 10: నీతూ నటరాజ్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ!

2026-11-22 10:38 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

2026-11-17 05:38 GMT

ఈవారం ఓటీటీ ప్రియులకి అసలైన మజా.. అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లివే!

2026-11-17 04:41 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల చేతిలో నామినేషన్స్!

2026-11-17 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS