ఢిల్లీ టీనేజర్ల మర్డర్ కేసు.. సిరీస్ టాక్ ఎలా ఉందంటే?

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన కథలైతే ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయి.

Update: 2026-06-14 12:23 GMT

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన కథలైతే ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాఖ్ వెబ్ సిరీస్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సిరీస్.. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

1970ల చివర్లో ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఇద్దరు టీనేజర్ల హత్య కేసు ఆధారంగా ఆ సిరీస్‌ ను తెరకెక్కించారు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ ఘటన ప్రజల్లో పెద్ద ఎత్తున భయం క్రియేట్ చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కుదిపేసిన ఆ ఇష్యూను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సిల్వర్ స్క్రీన్ పై చూపించిన ప్రయత్నం చేశారు.

సిరీస్‌ లో అసలు ఘటనకు సంబంధించిన పాత్రల పేర్లను మార్చినా.. కథలోని ఎమోషన్స్ ను మాత్రం అలాగే ఉంచారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన, న్యాయం కోసం వారి పోరాటం ప్రేక్షకులను కదిలించేలా చూపించారు. అదే సమయంలో కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారికి ఎదురయ్యే సవాళ్లు కూడా ఆసక్తికరంగా మలిచారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ లో నటించిన అలీ ఫజల్ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. అత్యంత క్లిష్టమైన కేసును పరిష్కరించాల్సిన అధికారిగా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు నేచురల్ గా అనిపిస్తాయి. బాధిత కుటుంబ సభ్యుల పాత్రలు పోషించిన క్యాస్టింగ్ ఎమోషనల్ సీన్స్ లో హృదయానికి హత్తుకునేలా నటించారు.

సిరీస్‌ కు మరో ప్రధాన బలం నేరస్తుల మనస్తత్వాన్ని చూపించిన విధానం. వారు ఎలా ఆలోచించారు? ఎలాంటి పరిస్థితులు వారిని ఆ దారిలో నడిపించాయి? అనే అంశాలను దర్శకుడు వివరించే ప్రయత్నం చేశారు. అయితే వారి బ్యాక్ గ్రౌండ్ ను చూపించినంత మాత్రాన నేరాన్ని సమర్థించలేదు. తప్పు ఎప్పటికీ తప్పేననే మెసేజ్ ను కథ అంతా కొనసాగించారు.

స్క్రీన్‌ ప్లే కూడా ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా సాగుతుంది. ప్రతి ఎపిసోడ్‌ లో సస్పెన్స్ కొనసాగిస్తూ నెక్స్ట్ పార్ట్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇన్వెస్టిగేషన్, ఎమోషన్స్, సోషల్ యాంగిల్స్ ను బ్యాలెన్స్ గా మిక్స్ చేయడం చేయడం సిరీస్‌ కు కలిసొచ్చింది. ఢిల్లీ నగరంలోని ఆ కాలం వాతావరణాన్ని న్యాచురల్ గా రీ క్రియేట్ చేయడం మరో విశేషంగా చెప్పొచ్చు.

అయితే కొన్నిచోట్ల కథ నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఫ్లాష్‌ బ్యాక్ సన్నివేశాలు మరింత కుదించాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వైలెన్స్ సీన్స్ కొంతమందికి అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులతో కలిసి చూసే ముందు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

ఏదేమైనా నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి 'రాఖ్' బెస్ట్ సెలక్షన్ గా నిలుస్తోంది. థ్రిల్‌ తో పాటు ఎమోషన్స్ తో రూపొందించిన ఆ సిరీస్.. నేరం వెనుక ఉన్న హ్యుమన్ యాంగిల్ కూడా ఆలోచింపజేస్తుంది. ఈ వీకెండ్ ఓటీటీలో కొత్తగా ఏదైనా చూడాలనుకునే వారికి రాఖ్ ఇంట్రెస్టింగ్ వాచబుల్ సిరీస్ గా చెప్పాలి.

Tags:    

Similar News