ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న మా ఇంటి బంగారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం.

Update: 2026-06-19 06:22 GMT

నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం. శ్రీముఖి , అర్చన , గుల్షన్ దేవయ్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కొంతమంది సినిమాలో సమంత తన యాక్షన్ పర్ఫామెన్స్ తో ఫ్యామిలీ సన్నివేశాలలో ఒదిగిపోయింది అని కామెంట్ చేస్తుంటే.. మరొకవైపు సమంతా తోడికోడలిగా శ్రీముఖి అద్భుతంగా నటించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సమంత ఈ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ను అలరిస్తోంది.

ఈ సినిమా వీకెండ్స్ లో ప్రేక్షకుల ముందుకు రావడం.. మరొకవైపు ఈ సినిమాకు పోటీగా మరొక సినిమా విడుదల లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇకపోతే సినిమా థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో మరొకవైపు ఓటీటీ లవర్స్ ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుంది ? ఏ ఓటిటి ప్లాట్ఫారం ద్వారా అందుబాటులోకి రాబోతోంది ? అనే విషయాలు సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. మరి సమంత ప్రధాన పాత్ర పోషిస్తూ యాక్షన్ పెర్ఫార్మెన్స్ లో అదరగొట్టేసిన ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా స్ట్రీమింగ్ కి రాబోతోంది? ఎప్పుడు రాబోతోంది? అనే విషయం ఎప్పుడు చూద్దాం.

మా ఇంటి బంగారం ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై స్వయంగా సమంత నిర్మించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా సమంత భర్త, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో పాటు హిమాంక్ ఈ చిత్రాన్ని నిర్మించారు.పైగా రాజ్ ఈ చిత్రానికి కథా , స్క్రీన్ ప్లే కూడా అందించడం గమనార్హం. ఓ బేబీ తర్వాత మళ్లీ సమంత , నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ ఓటీటీ లోకి రాబోతోంది అనే విషయానికొస్తే ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ వేదికగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మా ఇంటి బంగారం సినిమా టైటిల్ కార్డ్స్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు.

మా ఇంటి బంగారం స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అంటే కచ్చితంగా 4 లేదా ఎనిమిది వారాల తరువాతే ఆ సినిమా థియేటర్లలోకి వస్తుంది. మరి ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల చేత పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో మరో రెండు నెలల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అభిమానుల కోరిక మేరకు ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి.

మా ఇంటి బంగారం సినిమా కథాంశం..

మా ఇంటి బంగారం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ప్రేమించి, పెళ్లి చేసుకుని ఒక గ్రామంలో ఉండే సాంప్రదాయ కుటుంబంలోకి పెద్ద కోడలిగా అడుగుపెడుతుంది సమంత. అదే సమయంలో చిన్న కోడలిగా ఉన్న శ్రీముఖిని ఆదర్శంగా చూపిస్తూ శ్రీముఖి లాగా ఉండాలని సమంతకు కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు. ఇక కోడలిగా మెప్పు పొందడానికి అటు సమంతా చేసే ప్రయత్నం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో సమంత ఒక దళంలోకి దిగడం, గన్ను పట్టుకోవడం, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ తాలూకా జ్ఞాపకాలు ఆమెను మళ్లీ వెంటాడడం, తన కుటుంబం జోలికి వచ్చిన ముఠాతో సమంత ఏ విధంగా ఎదుర్కొంది? సమంత బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత అత్తవారింటి వారు ఆమెను ఎలా స్వీకరించారు ? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. పక్కా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అంటూ అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Tags:    

Similar News