అతడి తలను వేటాడిన బంతి.. కెరీర్ నే బలి తీసుకుంది..

విల్ పకోవ్ స్కీ.. వినగానే మనకు పక్కున నవ్వొచ్చే పేరు... ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన అతడి జీవితం కూడా అంతే విచిత్రంగా ముగిసింది.;

Update: 2025-04-08 22:30 GMT

విల్ పకోవ్ స్కీ.. వినగానే మనకు పక్కున నవ్వొచ్చే పేరు... ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన అతడి జీవితం కూడా అంతే విచిత్రంగా ముగిసింది.

కేవలం 20 ఏళ్ల వయసుకే భవిష్యత్ ఆస్ట్రేలియా సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న పకోవ్ స్కీ.. దానికితగ్గట్లే తమ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, ఆడింది ఒక్క టెస్టు మాత్రమే.

కంకషన్ కు మారు పేరు..

క్రికెట్లో బంతి తలకు తగిలి రిటైర్డ్ కావడం (కంకషన్) బాధితుడు పకోవ్ స్కీ. ఎందుకంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలుసార్లు అతడు ఇదే తరహాలో బాధితుడయ్యాడు.

ప్రస్తుతం 27 ఏళ్లున్న పకోవ్ స్కీ ఇకపై క్రికెట్ ఆడకూడదని వైద్యులు నిర్థారించారు.

వాస్తవానికి పకోవ్ స్కీ కొంచెం తిక్క క్యారెక్టర్. 2021లో భారత్ పై డెబ్యూ చేసిన అతడికి అదే చివరి టెస్టు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అయితే, తరచూ మానసిక కారణాలు చెప్పి టీమ్ కు దూరమయ్యే అలవాటున్నవాడు పకోవ్ స్కీ. అయినా ప్రతిభావంతుడు కావడంతో ఆస్ట్రేలియా నేషనల్ టీమ్ కు ఎంపిక చేశారు.

నిరుడు పకోవ్ స్కీ ఓ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అయితే, తలకు మరోసారి బంతి తగిలింది. ఏమీ జరగలేదు అని అనుకున్నా.. అదే ఇప్పుడు అతడికి గేమ్ కూ శాశ్వతంగా దూరం చేసింది. ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా చేసింది.

ఆస్ట్రేలియా దేశవాళీ ఫెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మేనియా – విక్టోరియా మధ్య సరిగ్గా నిరుడు మార్చిలో మ్యాచ్ లో టాస్మేనియాకు ఆడుతూ పేసర్ రిలే మెరిడిత్‌ వేసిన బంతి పకోవ్ స్కీ హెల్మెట్‌ ను గట్టిగా తాకింది. కుప్పకూలి విలవిల్లాడిన అతడు రిటైర్డ్‌ హర్ట్‌ గా వెనుదిరిగాడు. పరీక్షల అనంతరం అతడు క్రికెట్ ఆడే స్థితిలో లేడని తేలింది. మెడికల్ ప్యానల్ రికమండేషన్‌ సూచనతో పకోవ్ స్కీ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Tags:    

Similar News