టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు... ఓపెన్ అయిపోయిన శుభ్ మన్!

అలా అని మే 26న జరిగే ఫైనల్ వరకూ వేచి చూసే అవకాశం లేదు. ఈ నెల 30లోగా జట్టు సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Update: 2024-04-27 10:52 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరోపక్క టీ20 వరల్డ్ కప్ - 2024కి సంబంధించిన సందడి మొదలైంది. జూన్ 2 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నమెంట్ కోసం జట్టు ఎంపిక పై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐపీఎల్ లో ప్లేయర్స్ చూపించిన పెర్ఫార్మెన్స్ కూడా కీలకంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

అలా అని మే 26న జరిగే ఫైనల్ వరకూ వేచి చూసే అవకాశం లేదు. ఈ నెల 30లోగా జట్టు సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో... ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారు.. టీ20 వరల్డ్ కప్ లో స్థానంపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ స్పందించాడు. చోటు దక్కకపోతే హర్ట్ అవుతానంటున్నాడు!

అవును... టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించే సమయం దగ్గరపడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30లోగా జట్టు వివరాలను వెల్లడించాలి! దీంతో... బీసీసీఐ సెలక్టర్లు, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం పెట్టి శని, ఆదివారాల్లో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్ దాదాపు ఫిక్స్‌ అయ్యారని లీకులు వస్తున్నాయి.

ఇదే సమయంలో... బ్యాకప్‌ ఓపెనర్‌ గా శుభ్‌ మన్‌ గిల్‌ ను తీసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. ఈ సమయంలో తన ఎంపికపై స్పందించిన గిల్... టీ20 వరల్డ్ కప్ లో ఒకవేళ సెలక్ట్‌ కాకపోతే ఎవరైనా సరే నిరుత్సాహానికి గురవుతారని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా... తన పెర్ఫార్మెన్స్ & ఎక్స్ పీరియన్స్ పై స్పందించాడు. ఇందులో భాగంగా... గతేడాది వరల్డ్ కప్ ఆడిన అనుభవం తప్పకుండా అక్కరకొస్తుందని చెప్పుకొచ్చాడు.

ఇదే క్రమంలో... గతేడాది ఐపీఎల్ సీజన్‌ లో సుమారు 900 పరుగులు చేసినట్లు గుర్తుచేసిన గిల్... జట్టులో ఉంటాననే నమ్మకం ఉందని.. ఒకవేళ ఎంపిక కాకపోయినా.. భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటా అని తెలిపాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ లో శుభ్ మన్ గిల్ 9 మ్యాచుల్లో 304 పరుగులు చేసిన సంగతి తెలిసిందే! మరి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో శుభ్ మన్ గిల్ ఉంటాడా.. లేదా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News