సన్ రైజర్స్ హైదరాబాద్.. ‘ఆ కుర్చీని మడత పెట్టి’.. చిందులే చిందులు
మొత్తం 200 మంది అంతర్జాతీయ, జాతీయ క్రికెటర్లు భారత్ లోని వివిధ నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం బస చేశారు. మరోవైపు వీరంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు;
దేశంలో ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి నడుస్తోంది. మొత్తం 200 మంది అంతర్జాతీయ, జాతీయ క్రికెటర్లు భారత్ లోని వివిధ నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం బస చేశారు. మరోవైపు వీరంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు.
సినిమాలు.. క్రీడలు చాలా దగ్గరి సంబంధం ఉన్నవి అనే సంగతి తెలిసిందే. గత కొన్ని సీజన్ల నుంచి ఈ బంధం బహిరంగంగా కనిపిస్తోంది. ఉదాహరణకు పాన్ ఇండియా సినిమాగా రికార్డు బద్దలు కొట్టిన పుష్ప-1లోని తగ్గేదేలే మేనరిజంను ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ చాలాసార్లు మైదానంలో చేసి చూపాడు.
తాజాగా సన్ రైజర్స్ జట్టులోని గత ఏడాది వచ్చిన తెలుగు సినిమా ‘గుంటూరు కారం’లోని బాగా పాపులర్ అయిన పాట ’ఆ కుర్చీని మడతపెట్టి’ పాటకు స్టెప్పు లేశారు.
హైదరాబాద్ లోనే అనుకుంటా.. ఎక్కడ జరిగిందో కానీ.. ఓ కార్యక్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
అక్కడ భారీ తెర మీద గుంటూరు కారంలోని ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ ప్లే అవుతుండగా ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి స్టెప్పులేశారు. క్లాసెన్, హెడ్ దానిని ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో 2024లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించారు. మహేశ్ అందానికి తోడు కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నా.. టైమ్ మాత్రం బాగోలేక ఈ సినిమా ఫెయిల్యూర్ జాబితాలో చేరింది. అయితే, అప్పటి సినిమాల ప్రభావంతోనే ఇలా జరిగిందని కొందరు జస్టిఫికేషన్ ఇస్తుంటారు. టీవీ, ఓటీటీలో గుంటూరు కారం చూసినవారిలో చాలామంది ఆ సినిమాను ఫ్లాప్ అని అంటే ఒప్పుకోరు.. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ కు ముందుగా రాజమండ్రి రాగమంజరి అంటూ సాగుతూ ’ఆ కుర్చీని మడత పెట్టి’ సాంగ్ ను.
ఇప్పటికీ ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ చాలా పెళ్లిళ్ల బారాత్ లలో మార్మోగుతోంది.