6 మ్యాచ్ లు.. హ్యాట్రిక్ డక్ లు.. మొత్తం 4.. సయీమ్ డకూబ్
క్రికెట్ లో డకౌట్లు (పరుగులేమీ చేయకుండా ఔట్) సహజం... అసలు బ్యాటింగ్ రాని బౌలర్లయితే ఇలా ఖాతా తెరవకుండా ఔట్ కావడం ఇంకా సహజం.. ఒక బ్యాటర్ ఒక టోర్నీలో రెండుసార్లు డకౌట్ అవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.;
క్రికెట్ లో డకౌట్లు (పరుగులేమీ చేయకుండా ఔట్) సహజం... అసలు బ్యాటింగ్ రాని బౌలర్లయితే ఇలా ఖాతా తెరవకుండా ఔట్ కావడం ఇంకా సహజం.. ఒక బ్యాటర్ ఒక టోర్నీలో రెండుసార్లు డకౌట్ అవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.. కానీ, ఓ ప్రధాన జట్టు ఓపెనర్ గా దిగుతూ.. ఈ క్రికెటర్ మాత్రం ఏకంగా నాలుగు డక్ లు పెట్టాడు.. అది కూడా ఈ ఆసియా కప్ లో కావడం విశేషం. ఇందులో రెండు గోల్డెన్ డక్ (మొదటి బంతికే ఔట్)లు కావడం ఇంకా విశేషం.
ప్రతిభావంతుడా.. పైరవీలతో వచ్చాడా..?
బ్యాటింగ్ రాని బౌలర్లు కూడా కనీసం ఒకటీ రెండు పరుగులు చేస్తుంటారు. కానీ, ఇన్నింగ్స్ ప్రారంభించే బ్యాటర్ ఇలా డక్ లు మీద డక్ లు పెట్టడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే అతడు పాకిస్థాన్ బ్యాట్స్ మన్ కావడం. ఆ దేశ క్రికెట్ లో పైరవీలు, మ్యాచ్ ఫిక్సింగ్ దరిద్రాలు ఉండడంతో అభిమానులు కూడా అరె ఏంట్రా.. ఇది? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకూ ఎవరా క్రికెటర్?
పైన చెప్పుకొన్నదంతా పాకిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ సయీమ్ అయూబ్ గురించి. ఈ ఆసియా కప్ లో ఆరు మ్యాచ్ లు (లీగ్ 3, సూపర్ సిక్స్ 3) ఆడిన ఈ ఓపెనర్ నాలుగుసార్లు పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఇందులో మూడు హ్యాట్రిక్ డక్ లు ఒమన్, భారత్, యూఏఈ మీదనే ఉండడం గమనార్హం. భారత్ అంటే గట్టి జట్టు కాబట్టి డకౌట్ అయ్యాడంటే అర్ధం ఉంది. కానీ, మిగతా రెండూ పసికూనలు. ఇలాగైతే ఇక లాభం లేదని సూపర్ 4లో భారత్ పై వన్ డౌన్ లో దింపగా హమ్మయ్య అన్నట్లు 21 పరుగులు చేశాడు. శ్రీలంక మీద 2 పరుగులే చేశాడు. తాజాగా సూపర్ 4 లో పాక్ కు అత్యంత కీలకమైన బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మళ్లీ డకౌట్ అయ్యాడు.
ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు???
6 మ్యాచ్ లలో నాలుగు డక్ లు పోగా 23 పరుగులే చేసిన సయీమ్ అయూబ్ ను ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు అంటే.. అతడు తన స్పిన్ బౌలింగ్ తో వికెట్లు తీస్తున్నాడు. భారత్ పై లీగ్ మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. సూపర్ 4లో బంగ్లాపై 2 వికెట్లు తీశాడు. ఎడమచేతి బ్యాటర్, కుడిచేతి ఆఫ్ స్పిన్నర్ అయిన 23 ఏళ్ల సయీమ్ ప్రతిభావంతుడే. 2021లో 18 ఏళ్ల కుర్రాడిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అదరగొట్టాడు. పాక్ తరఫున 12 వన్డేల్లోనే మూడు సెంచరీలు కొట్టాడు. 47 అంతర్జాతీయ టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అతడి అత్యధిక స్కోరు 98 నాటౌట్ కావడం గమనార్హం.