• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  రూ.110 కోట్లు.. 20 మంది...

రూ.110 కోట్లు.. 20 మంది ప్లేయర్స్.. మరి ఆ ఫ్రాంచైజీ ఏం చేస్తుంది?

| అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా వచ్చేసింది.

By - Tupaki Desk
Update: 2024-11-02 12:30 GMT

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా వచ్చేసింది. ఏ జట్టు ఎందరిని తమతో ఉంచుకుందో తేలిపోయింది. మొత్తం పది ఫ్రాంచైజీలు.. నిబంధనల ప్రకారం ఒక్కోటి గరిష్ఠంగా అయిదుగురు అంతర్జాతీయ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. మరో విధంగా చెప్పాలంటే గరిష్ఠంగా తమ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. లేదా వేలంలో రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్టీఎం) ద్వారా తిరిగి సొంతం చేసుకోవచ్చు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్ ఆరుగురు చొప్పున ఆటగాళ్లను తీసుకున్నాయి కాబట్టి వేలంలో ఆ ఫ్రాంఛైజీలు ఆర్టీఎం వాడటానికి అవకాశం లేదు. ఇక ఆటగాళ్ల రిటైన్, వేలంలో కొనుగోలు కోసం ప్రతి ఫ్రాంఛైజీ గరిష్ఠంగా రూ.120 కోట్లు ఖర్చు పెట్టొచ్చు.

ఫ్రాంచైజీలు ఒక్కోటి ఆరుగురిని గరిష్ఠంగా రిటైన్ చేసుకోవచ్చు అనుకుంటే 60 మంది వరకు అవుతారు. కానీ, 46 మందినే రిటైన్ చేసుకున్నాయి. కోల్ కతా, రాజస్థాన్ అందరినీ అట్టిపెట్టుకున్నాయి. పంజాబ్ మాత్రం ఇద్దరినే రిటైన్ చేసుకుంది. వారిద్దరూ కూడా ఇంతవరకు భారత్ కు ఆడనివారు (అన్ క్యాప్డ్) కావడం గమనార్హం. ఈ ఏడాది మంచి ప్రతిభ కనబర్చిన శశాంక్ సింగ్ ను రూ.5.50 కోట్లకు, ప్రభ్ సిమ్రన్ సింగ్ ను రూ.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇది అత్యంత ఆశ్చర్యకర ఎంపిక అనడంలో సందేహం లేదు.

ఇంకా 110 కోట్లు..

రూ.9.5 కోట్లకు ఇద్దరినే అట్టిపెట్టుకున్న పంజాబ్ వద్ద ఇంకా 110.50 కోట్లు ఉన్నాయి. లీగ్ లో ఏ జట్టు వద్ద కూడా ఇంత మొత్తం లేదు. బెంగళూరు (83 కోట్లు), ఢిల్లీ, లక్నో (73 కోట్లు), గుజరాత్ (69 కోట్లు), చెన్నై (55 కోట్లు), కోల్ కతా (51 కోట్లు), సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ (45 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.41 కోట్లు) ఇలా ఏది చూసినా అన్నీ పంజాబ్ కంటే వెనుకే ఉన్నాయి. మరి రూ.110 కోట్లతో ఏం చేస్తుందా? అని అంటే.. మెగా వేలానికి వచ్చినవారిని కొనుక్కుంటుంది. ఒక ఐపీఎల్ జట్టులో 22 మంది ఉంటారు. రూ.110 కోట్లతో పంజాబ్ ఇంకా 20 మందిని తీసుకోవాలి. అంటే.. సగటున ఒక్కో ఆటగాడికి రూ.5 కోట్లు వ్యయం చేసేందుకు అవకాశం ఉందన్నమాట.

కెప్టెన్ కూడా..

పంజాబ్ తమ కెప్టెన్ శిఖర్ ధావన్ ను కూడా వదులుకుంది. అంటే.. వచ్చే సీజన్ లో కెప్టెన్ సహా కొత్తవారిని తీసుకోవాల్సిందే. కాగా.. పంజాబ్ కెప్టెన్ గా ఎవరిని తీసుకోవాలన్నా.. కనీసం 15 కోట్లు తక్కువ ఉండదు. తాజాగా లక్నో వదులుకున్న కేఎల్ రాహుల్ గతంలో పంజాబ్ కు ఆడినవాడే. కెప్టెన్ గానూ అనుభవం ఉన్నవాడు. కాబట్టి రాహుల్ పై కన్నేస్తుందేమో ప్రీతి జింటా జట్టు?

Tags:    
  • kingsxipunjab 
  • PBKS 
  • Ipl2025 
  • Bcci 
  • Auction 
  • Retention 
  • Shashanksingh 
  • Mumbaindians 

Similar News

పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి.. టిలక్ వర్మ బ్యాటింగ్‌పై విమర్శలు!

2026-11-23 03:58 GMT

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

2026-11-22 11:28 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS