• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  టీమ్ ఇండియాలో హైదరాబాదీ...

టీమ్ ఇండియాలో హైదరాబాదీ పేసర్ కు డేంజర్ బెల్..

| ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలకు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో చెప్పుకోదగ్గ అంశం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం.

By - Tupaki Desk
Update: 2025-01-19 20:30 GMT

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలకు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో చెప్పుకోదగ్గ అంశం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం. 2017లో టి20లు, 2019లో వన్డేలు, 2020లో టెస్టు జట్టులోకి వచ్చిన సిరాజ్ కు ఇప్పటివరకు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. నిలకడగా రాణిస్తుండడంతో అటు సెలక్షన్ కమిటీ కూడా మూడు ఫార్మాట్లలో ఆడించింది. కాగా, ఇప్పుడు మాత్రం సిరాజ్ కు డేంజర్ బెల్ మోగింది.

తొలిసారి వేటు?

గత ఏడేనిమిదేళ్లలో సిరాజ్ ఒకటీ రెండుసార్లు టీమ్ ఇండియాకు దూరమైనా అది అతడికి విశ్రాంతి ఇవ్వడమే. నేరుగా మాత్రం వేటు వేయలేదు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం అంటే మాత్రం వేటు వేసినట్లుగానే లెక్క. పైగా సిరాజ్ స్థానంలో ఎడమచేతి వాటం పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను తీసుకున్నారు. ఇది ఒక రకంగా హైదరాబాదీకి హెచ్చరికనే. సిరాజ్ 2023 నుంచి 28 మ్యాచ్‌ లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 5.41. ఇది మంచి ఎకానమీనే.

పాత బంతితో పడగొట్టలేక..

సిరాజ్ కొత్త బంతితో మాత్రమే వికెట్లు తీస్తున్నాడని, పాత బంతితో తేలిపోతున్నాడని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అందుకనే వన్డేలకు పక్కనపెట్టినట్లు చెప్పాడు. టి20లతో పాటు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో రాణించడం, ఎడమ చేతివాటం కావడంతో అర్షదీప్ కు అవకాశం దక్కింది.

ఇక షమీ తిరిగిరావడమూ సిరాజ్ స్థానానికి ఎసరు తెచ్చింది. షమీ కొత్త బంతితో చెలరేగుతాడు. అర్షదీప్ పాత బంతితో రాణించగలడు. అందుకనే సిరాజ్ ను ఎంపిక చేయలేదని రోహిత్ వివరణ ఇచ్చాడు.

ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో సిరాజ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దీనికోసం రంజీలు ఆడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Mohammedsiraj 
  • Teamindia 
  • Championstrophy 
  • Rohitsharma 
  • BCCI 
  • ICC 
  • Hyderabad 
  • Viratkohli 

Similar News

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS