ఆపరేషన్ సిందూర్..ఐపీఎల్ లో క్రికెటర్..పీవోకేలో అమ్మానాన్న..ఆ తర్వాత

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన అతడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వెళ్లిపోయి తిరిగిరాకపోవడానికి కారణం ఏంటో తెలిసింది.;

Update: 2025-05-19 05:50 GMT

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన అతడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వెళ్లిపోయి తిరిగిరాకపోవడానికి కారణం ఏంటో తెలిసింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అతడికి కాస్త కలవరం కలిగించింది.

అవిభాజ్య భారత దేశంలో పుట్టి అనంతరం ఇంగ్లండ్ వెళ్లిపోయిన కుటుంబంలో పుట్టిన అతడు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరాడు. మంచి ఆల్ రౌండర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి క్రికెటర్ తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో తన కుటుంబానికి ఎదురైన పరిస్థితిని గుర్తుచేశాడు.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గురించి అందరికీ తెలిసిందే. టెస్టులు, వన్డేలు, టి20ల్లో పనికొచ్చే ఆటగాడిగా పేరున్న అతడు.. ప్రస్తుత ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అయితే, పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అతడు భారత్ లోనే ఉండి కోల్ కతాకు ఆడుతున్నాడు. మోయిల్ తల్లిదండ్రులు మాత్రం ఆ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉన్నారట. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత దాడులు చేస్తుండడంతో తాను తీవ్ర ఆందోళన చెందినట్లు చెప్పాడు.

తన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశానికి కేవలం 50 కిలోమీటర్లు (గంట ప్రయాణం) దూరంలో భారత్ దాడి చేసిందని మోయిన్ వివరించాడు. యుద్ధం మొదలైందని భావించిన వారు అందుబాటులోని విమానం ఎక్కి బయటపడ్డారని పేర్కొన్నాడు.

కోల్ కతాకు ఆడుతున్న మోయిన్ అలీ లీగ్ వాయిదాతో ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. బహుశా పరిస్థితుల కారణంగా అతడు తిరిగి రాలేదని భావించవచ్చు. మోయిన్ కుటుంబం క్రికెట్ ను బాగా ఇష్టపడుతుంది. ఇతడి నలుగురు సమీప బంధువులు (ఇద్దరు కజిన్స్, ద్దరు సోదరులు) క్రికెటర్లే కావడం గమనార్హం. ఇక మోయిన్ అలీ తాత ప్రస్తుత పీవోకేలోని మీర్పూర్ నుంచి ఇంగ్లండ్ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే బ్రిటిషర్ ను పెళ్లాడారు. మోయిన్.. బర్మింగ్ హామ్ లో పుట్టాడు. 38 ఏళ్ల మోయిన్ 68 టెస్టులు,138 వన్డేలు, 92 టి20ల్లో ఇంగ్లండ్ కు ఆడాడు.

Tags:    

Similar News