• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  2 గాయాలు.. ఆస్ట్రేలియాలో...

2 గాయాలు.. ఆస్ట్రేలియాలో టీమిండియాకు బిగ్‌ షాక్‌..ఇక కష్టాలే

| ఇక తాజా సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 22న మొదలు కానుంది. అయితే, ఆ మ్యాచ్ కు ముందే టీమ్ ఇండియాకు అపశకునాలు ఎదురవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-17 19:30 GMT

క్రికెట్ లో న్యూజిలాండ్ లో పిచ్ లు విపరీతమైన గాలి కారణంగా పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తాయి.. దక్షిణాఫ్రికాలో బౌన్స్ తో బెంబేలెత్తిస్తాయి.. ఇంగ్లండ్ లో స్వింగ్ తో కంగారు పెడతాయి.. ఇక ఆస్ట్రేలియాలో అయితే ఇవన్నీ కలిసినట్లు కనిపిస్తాయి.. పైగా కంగారూ జట్టుతో టెస్టు సిరీస్ అంటే ప్రత్యర్థి జట్లకు ముందే ముచ్చెమటలు పడతాయి. అంతటి కఠిన సవాల్ ఇప్పుడు టీమ్ ఇండియా ముందుంది. కానీ, మైదానంలోకి దిగకముందే మన జట్టుకు కష్టాలు మొదలయ్యాయి.

33 ఏళ్ల తర్వాత..?

అప్పుడెప్పుడో విరాట్ కోహ్లికి ఇంకా నడక రాకముందే ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది టీమ్ ఇండియా. మళ్లీ 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల సమరానికి సిద్ధమైంది. ఇన్నేళ్లలో కంగారూ గడ్డపై మూడు లేదా నాలుగు మ్యాచ్ ల సిరీస్ లు మాత్రమే జరిగాయి. ఇక తాజా సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 22న మొదలు కానుంది. అయితే, ఆ మ్యాచ్ కు ముందే టీమ్ ఇండియాకు అపశకునాలు ఎదురవుతున్నాయి.

కెప్టెన్ లేడు.. ఓపెనర్ కు గాయం

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రెండోసారి తండ్రి అయిన అతడు.. జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లలేదు. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నాడు. ఆ నేపథ్యంలో యువ యశస్వి జైశ్వాల్ తో కలిసి టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసింది ఎవరు? అనే ప్రశ్న రాగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరు వినిపించింది. కానీ, ఇంట్రా టీమ్ మ్యాచ్ లో అతడి మోచేతికి దెబ్బ తగిలింది. దీంతో మైదానాన్ని వీడాడు. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియరావడం లేదు.

ఇప్పుడు గిల్ వంతు..

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు యువ బ్యాట్స్ మన్ శుభ్‌మ‌న్ గిల్‌ కూడా దూరమయ్యాడు. అతడి వేలు విరిగింది. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా గిల్ వేలికి బంతి బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు బయటకు వెళ్లిపోయాడు. గిల్ వేలిలో చీలిక వచ్చింది. తొలి టెస్టుకు ఇంకో ఐదు రోజులే సమయం ఉండగా గిల్‌ కోలుకోవడం కష్టమే. మ్యాచ్‌కు దాదాపు దూరమైనట్లే. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్, వన్ డౌన్ లో గిల్ స్థానాన్ని తమిళనాడు యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ భర్తీ చేసే అవకాశం ఉంది.

Tags:    
  • India 
  • Teamindia 
  • BGT 
  • Bordergavaskartrophy 
  • Rohitsharma 
  • Shubmangill 
  • Viratkohli 
  • Australia 
  • Injuries 
  • Bcci 
  • Icc 
  • Testseries 
  • Cricket 
  • Wtcchampionship 

Similar News

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS