• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  147 ఏళ్లు.. 5 లక్షల...

147 ఏళ్లు.. 5 లక్షల రన్స్.. చరిత్రలో ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ రికార్డు

| క్రికెట్ అంటే టెస్టు క్రికెటే.. మధ్యలో వన్డేలు వచ్చినా.. ఇప్పుడు టి20ల యుగం నడుస్తున్నా.. సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో రాణించిన ఆటగాళ్లే చరిత్రలో నిలిచిపోతారు.

By - Tupaki Desk
Update: 2024-12-07 11:30 GMT

క్రికెట్ అంటే టెస్టు క్రికెటే.. మధ్యలో వన్డేలు వచ్చినా.. ఇప్పుడు టి20ల యుగం నడుస్తున్నా.. సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో రాణించిన ఆటగాళ్లే చరిత్రలో నిలిచిపోతారు. ఇక క్రికెట్ కు పుట్టిల్లు ఇంగ్లండ్ అనే సంగతి తెలిసిందే. అసలు బ్రిటిష్ వాళ్లు పాలించిన దేశాల్లోనే క్రికెట్ ఉంది. మిగతా దేశాల్లో అంతంతమాత్రమే.

నెమ్మదైన టెస్టు నుంచి బజ్ బాల్

టెస్టులు, వన్డేలు, టి20లు అన్నిట్లోనూ ఇంగ్లండ్ అనేక ప్రయోగాలు చేసింది. టెస్టులను నిదానంగా ఆడాలన్నా పద్ధతిని బద్దలుకొట్టింది. బజ్ బాల్ అంటూ నాలుగైదేళ్లుగా టెస్టులను వన్డేలా తరహాలో ఆడుతోంది. ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. ఒక్క రోజులో 400 పరుగులను అలవోకగా సాధిస్తోంది.

5 లక్షల పరుగులు కొట్టేసింది

టెస్టు క్రికెట్‌ లో తాజాగా ఇంగ్లండ్‌ అరుదైన రికార్డు అందుకుంది. ఈ ఫార్మాట్‌ లో ఐదు లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటికి టెస్టు క్రికెట్ మొదలై 147 ఏళ్లు. అదికూడా తొలి మ్యాచ్ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్యనే జరిగింది. మొత్తమ్మీద ఇంగ్లండ్ 1,081 టెస్టులు ఆడింది. 1082వ టెస్టును న్యూజిలాండ్ తో ఆడుతోంది. ఇందులోనే 5 లక్షల మార్క్ ను చేరింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ లో 378/5 స్కోరుతో ఉంది. ఏకంగా 533 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ లో న్యూజిలాండ్‌ ను 125కే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. దీంతోపాటు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ హారీ బ్రూక్ వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. కాగా, ఇప్పటికే ఈ మూడు టెస్టుల సిరీస్‌ లో తొలి మ్యాచ్‌ లో ఇంగ్లండ్‌ గెలిచింది.

టెస్టుల్లో ఇంగ్లండ్ తో తొలి టెస్టు ఆడిన ఆస్ట్రేలియా ఇంకా 70 వేల పరుగుల వెనుకే ఉంది. ఆస్ట్రేలియా 4,28,868 పరుగులు చేయగా.. ఇండియా 2,78,751 పరుగులతో ఉంది.

147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు.. తొలి జట్టుగా ఇంగ్లండ్‌ ఘనతప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ చిరస్థాయిగా నిలిచిపోనుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు లక్షల పరుగుల మార్క్‌ను తాకిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ఘనత సాధించింది.#ENGvsNZ #NZvsENG #England #Cricket… pic.twitter.com/STeUyT5gBf

— Tupaki (@tupaki_official) December 7, 2024
Tags:    
  • England 
  • Testcricket 
  • Bazball 
  • Benstokes 
  • Joeroot 
  • Australia 
  • Teamindia 
  • Testformat 
  • ICC 
  • ECB 
  • Indvsaus 
  • Jaspritbumrah 
  • Testmatch 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS