చెన్నై సూపర్ కింగ్స్: పసుపు జెర్సీ నుంచి వెలసిన చేదు సీజన్

ఒకప్పుడు ఐపీఎల్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 2025 సీజన్‌లో అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది.;

Update: 2025-05-01 04:52 GMT

ఒకప్పుడు ఐపీఎల్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 2025 సీజన్‌లో అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. పసుపు జెర్సీ తో గర్వంగా మెరుపులు మెరిపించిన జట్టు, ఈసారి మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.పేలవ చరిత్రను సృష్టిస్తూ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.

- చెప్పాక్ నుంచి చేదు కబురు

బుధవారం చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలవ్వడం, ప్లేఆఫ్ ఆశలకు ముగింపు పలికింది. ఒకప్పుడు సొంతగడ్డలో అపజయం తెలియని చెన్నైకు, ఈ సీజన్‌లో అదే చెప్పాక్ లో వరుస ఐదు ఓటములు ఎదురవడం గమనార్హం. పంజాబ్‌తో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై చతికిల పడింది.

- పాయింట్ల పట్టికలో చివర

10 మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివర స్థానానికి పరిమితం కావడం ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత చేదు ఘట్టంగా నిలిచింది. ఈ ఫలితాలు అభిమానులకు మాత్రమే కాదు, జట్టు మేనేజ్‌మెంట్‌కు కూడా తీవ్ర ఆత్మపరిశీలనకు దారితీశాయి.

- ఎక్కడ తడబాటో?

చెన్నైకి గత సీజన్ల విజయాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమతుల్యత ముఖ్య కారణం. కానీ ఈ సీజన్‌లో మూడు విభాగాల్లోనూ స్థిరత్వం లేకపోవడం, కీలక సమయంలో స్టార్ ఆటగాళ్ల వైఫల్యం, కేబిన్ నుంచి వ్యూహాత్మక నిర్ణయాల లోపాలు జట్టు నిరాశకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

-భవిష్యత్తుకు పునరాగమనం అవసరం

ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ ని వెంటనే మర్చిపోయి, పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొత్త రక్తం పరిచయం చేయడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, జట్టు సంస్కరణల కోసం సీనియర్ లీడర్ల నుండి పునరాలోచన అవసరం. అలాగే, చెప్పాక్‌లో హోమ్ అడ్వాంటేజ్ ను మళ్లీ సాధించేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్, అభిమానుల గుండెల్లో చెరిగిపోని జట్టు. ఒక చెడు సీజన్ అన్నది ఏ దిశలోనైనా మార్పుకు అవకాశమే. వచ్చే సీజన్‌లో పసుపు జెర్సీ మళ్లీ తన స్ఫూర్తిని చూపించగలదా? అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు..

Tags:    

Similar News