షాక్ మీద షాక్; సఫారీలకు ఊహించని అవమానం

Update: 2015-07-15 21:09 GMT
ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా.. స్థిరంగా ఆడుతూ.. సిరీస్ ల మీద సిరీస్ లు సొంతం చేసుకుంటుందన్న పేరున్న దక్షిణాఫ్రికా జట్టుకు బారీ అవమానం ఎదురైంది. కేవలం వారం వ్యవధిలో ఆ జట్టుకు తగిలిన షాక్ నుంచి తేరుకోవటానికి మరికొంత కాలం పట్టటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.

క్రికెట్ ప్రపంచంలో పసికూనగా చెప్పుకునే బంగ్లాదేశ్ జట్టు ఆటకు.. సఫారీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ లో పర్యటించిన దక్షిణాఫ్రికా జట్టు.. తొలి మ్యాచ్ లో అనూహ్యంగా ఓటమి పాలుకావటం తెలిసిందే. రెండో మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకున్న సౌత్ ఫ్రికా జట్టు.. బుధవారం కీలకమైన మూడో మ్యాచ్ జరిగింది.

ఎవరూ అంచనాలు వేయని విధంగా రాణించిన బంగ్లాదేశ్ జట్టు.. భారీ విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. సిరీస్ ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ మధ్యనే టీమిండియాకు చేదుఅనుభవం మిగిల్చిన బంగ్లా జట్టు.. తాజాగా సఫారీలకు షాక్ మీద షాక్ ఇచ్చింది.

వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగటంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణా ఫ్రికా జట్టు 40 ఓవర్లలో తొమ్మది వికెట్లకు 168 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాజట్టు కేవలం 26.1 ఓవర్ల వ్యవధిలో ఒక్క వికెట్ నష్టానికి 169 పరుగులు సాధించిన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా బంగ్లా జట్టు రాణించటంతో బంగ్లాదేశీయుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగ్లాను పిల్ల జట్టుగా అంచనా వేసుకన్నా.. వారికి షాక్ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News