క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఒకేఒక్కడు

ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ లీగ్ లలో విండీస్ క్రికెటర్లు భీకరంగా తయారయ్యారు. అందులో ఒకరు ఆండ్రీ రస్సెల్.;

Update: 2025-12-09 12:30 GMT

టీ20 అంటేనే కరేబియన్ వీరులు గుర్తుకు వస్తారు. వారు ఒకప్పుడు భీకర టీంగా ఉండేది. కానీ డబ్బులు, ప్రాంఛైజీల రాకతో విండీస్ క్రికెటర్లు అంతా కూడా దేశానికి ఆడడం కంటే ఐపీఎల్ లాంటి భారీ ఫ్రాంచైజీలు ఆడడానికి మొగ్గుచూపుతున్నారు. ఉన్నంతలో సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ లీగ్ లలో విండీస్ క్రికెటర్లు భీకరంగా తయారయ్యారు. అందులో ఒకరు ఆండ్రీ రస్సెల్.

వెస్టిండీస్ విధ్వంసక ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. పొట్టి ఫార్మాట్ టీ20 చరిత్రలో 5వేల పరుగులు, 500+ సిక్సర్లు, 500 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ అసాధారణమైన ట్రిపుల్ కాంబినేషన్ రికార్డుతో రస్సెల్ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని లిఖించుకున్నాడు.

అన్ని దేశాల లీగ్ మ్యాచులతో కలిపి రస్సెల్ ఇప్పటివరకూ 576 టీ20 మ్యాచ్ లు ఆడారు. ఈ సుధీర్ఘ కెరీర్ లో ఆయన సాధించిన గణాంకాలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పటిదాకా మొత్తం 9496 పరుగులు చేశారు. 62 వికెట్లు తీశారు. 972 సిక్సర్లు బాదారు.

ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే టీ20 క్రికెట్ లో ఇప్పటికే పలువురు దిగ్గజ ఆటగాళ్లు ఈ రికార్డులను నెలకొల్పారు. అందులో 5000+ పరుగులు చేసిన వాళ్లు దాదాపు 126 మంది ఆటగాళ్లున్నారు. 500+ వికెట్లు తీసిన వారు ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. 500+ సిక్సర్లు కొట్టిన వారు 10 మంది ఆటగాళ్లు ఉన్నారు.

అయితే ఈ మూడు రికార్డులను ఒక్క ఆటగాడిగా సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి ఆండ్రీ రస్సెల్ కావడం ఆయన ప్రత్యేకత. అతడు ఈ ఘనత టీ20 ఫార్మాట్ లో అతడి ఆధిపత్యాన్ని బ్యాట్, బంతితో అతను జట్టుకు విలువను తెలియజేస్తుంది. ఈ రికార్డు అతడిని క్రికెట్ లోనే వన్ అండ్ ఓన్లీ క్రీడాకారుడిగా నిలిపాయి.

ఆండ్రీ రస్సెల్ సాధించిన ఈ ట్రిపుల్ ఘనతతో టీ20 క్రికెట్ లో ఆల్ రౌండర్ పాత్రకు ఒక కొత్త ప్రమాణాన్ని నిర్ధేశించింది. అతడు ఈ ఫార్మాట్ లో అంత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకడిగా నిస్సందేహంగా నిరూపించుకున్నారు.

Tags:    

Similar News