మహేష్ బాబు-బుచ్చి బాబు కాంబోపై ఫ్యాన్స్ వ్యతిరేకతకు కారణాలు!
దీనికి తోడు ఈ స్క్రిప్ట్‌లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌పై వస్తున్న రూమర్స్ ఫ్యాన్స్‌ను మరింత కంగారు పెడుతున్నాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అయితే తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సనతో మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్నారంటూ వస్తున్న రూమర్స్ టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. సాధారణంగా ఇద్దరు క్రేజీ వ్యక్తుల కలయిక అంటే అభిమానులు పండగ చేసుకుంటారు. కానీ ఈ కాంబినేషన్ వార్తలపై మహేష్ బాబు అభిమానులు (SSMB ఫ్యాన్స్) సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తిని, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ మేకింగ్ స్టైల్ సూపర్ స్టార్ ఇమేజ్‌కు అస్సలు సెట్ కాదని వారు భావిస్తున్నారు.
అభిమానులు ఈ ప్రాజెక్ట్‌ను ఇంతలా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం `రాజమౌళి తదుపరి చిత్రం` అని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం `వారణాసి`ని 7 ఏప్రిల్ 2027 విడుదల లక్ష్యంగా తన పూర్తి సమయాన్ని కేటాయించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేసే ఏ చిత్రమైనా సరే అదే స్థాయి భారీతనంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ అంటే స్కేల్ పరంగా మ్యాచ్ అవ్వదని వారి ఆందోళన.
మరో ప్రధాన కారణం.. ఇరు వర్గాల మేకింగ్ శైలిలో ఉన్న డిఫరెన్స్ .. బుచ్చిబాబు సన ఇప్పటివరకు తీసిన ఉప్పెన, పెద్ది వంటి చిత్రాలు పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో.. ఎమోషనల్ గా... రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో సాగాయి.
అయితే మహేష్ తెరపై కనిపించే విధానం.. అతడి లుక్స్ .. క్లాస్ ఇమేజ్ అనేవి యూనిక్. ఇంతటి భారీ కమర్షియల్ ఫాలోయింగ్ ఉన్న హీరోని... బుచ్చిబాబు తనదైన మార్క్ రస్టిక్ సబ్‌జానర్‌లో చూపిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
దీనికి తోడు ఈ స్క్రిప్ట్‌లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌పై వస్తున్న రూమర్స్ ఫ్యాన్స్‌ను మరింత కంగారు పెడుతున్నాయి. బుచ్చిబాబు సిద్ధం చేసిన స్పోర్ట్స్ లేదా ఎమోషనల్ డ్రామా కథలో.. హీరో పాత్రకు కొన్ని శారీరక సవాళ్లు (ఉదాహరణకు దృష్టి లోపం లేదా వికలాంగుడిగా) ఉంటాయని ఫిలిం నగర్ టాక్. తమ ఫేవరెట్ గ్లామరస్ కమర్షియల్ హీరోని అంతలా డీ-గ్లామరైజ్ చేసి.. ఒక పరిమితమైన పాత్రలో చూడటానికి అభిమానులు అస్సలు ఇష్టపడటం లేదు. గతంలో ప్రభాస్-మారుతి కాంబినేషన్ ప్రకటించినప్పుడు కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇలాగే వారి ఇమేజ్ తారతమ్యాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది.
అయితే సోషల్ మీడియాలో ఎంత హంగామా నడుస్తున్నా.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఏదీ ఫైనలైజ్ కాలేదు. తాజాగా ఈ రూమర్లపై దర్శకుడు బుచ్చిబాబు సన స్పందిస్తూ.. ``సరైన సమయం వచ్చే వరకు వేచి చూద్దాం`` అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను ఆయన పూర్తిగా ఖండించలేదు, అలాగని అధికారికంగా ధృవీకరించనూ లేదు. మరి భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మేకర్స్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.