ఐదేళ్లకే దిక్కులేదంటే 15 ఏళ్ల మాటా సుబ్బారెడ్డి?
ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా రాజీ పడని పరిస్థితి. అదేం దరిద్రమో కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. కేంద్రంతో సయోధ్యతతో వ్యవహరించాలని.. కేంద్రం నుంచి అవసరాలు ఉన్న నేపథ్యంలో తొందరపడకూడదని.. మిత్రత్వం ఉన్న నేపథ్యంలో మిత్రధర్మాన్ని పాటించాలన్న చిత్రవిచిత్రమైన వాదనలు వినిపిస్తారే కానీ.. ‘ఏపీకి కావాల్సింది ఇది. ఇస్తారా? చస్తారా?’అంటూ సూటిగా అడిగే ధైర్యం ఉన్న రాజకీయ పక్షం ఒక్కటి కాదంటే ఒక్కటి కూడా కనిపించదు.
మిత్రధర్మం పేరిట ఏపీ అధికారపక్షం ఆచితూచి అడుగులు వేస్తే.. ఏపీ విపక్షం కూడా ధైర్యం నిలదీసే ప్రయత్నం చేయకపోవటం కనిపిస్తుంది. ఏపీలో చచ్చిపోయినట్లుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రైవేటు బిల్లు పెట్టారే కానీ.. ఏపీ అధికారపక్షం కానీ ఏపీ విపక్షం కానీ ఆ పని చేయకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లు పుణ్యమా అని ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది.
రాజకీయ వర్గాల్లో కూడా ఈ బిల్లు కదలికను తీసుకొచ్చిందనే చెప్పాలి. కేవీపీ ప్రైవేటు బిల్లు తెర మీదకు వచ్చి.. బిల్లు మీద ఓటింగ్ జరుగుతుందన్న వేళ.. ఆ పనిని మిగిలిన పార్టీలు ఇప్పటివరకూ ఎందుకు చేయలేకపోయావన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ప్రైవేటు బిల్లుతో కాంగ్రెస్ పొందే రాజకీయ ప్రయోజనాన్ని చూసిన ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ లోనూ కదలికను తెచ్చింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఇదే అంశం మీద మరో ప్రైవేటు బిల్లును ప్రతిపాదించారు. ఆయన ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లులో ఆంధప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగం కింద సెక్షన్ 94ఏ.. 94బీ.. 94సీ సెక్షన్లను అదనంగా చేర్చాలని కోరుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను పదిహేనేళ్లు ఇవ్వాలని.. హోదా గురించి నాటి ప్రధాని మన్మోహన్ స్వయంగా రాజ్యసభలో హామీ ఇచ్చారని సుబ్బారెడ్డి గుర్తు చేస్తున్నారు. ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదాకే దిక్కులేని వేళ.. వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఏకంగా పదిహేనేళ్ల హోదా కోసం ప్రయత్నం చేస్తున్నామని.. ఇందుకోసం చట్టంలో చేయాల్సిన మార్పు గురించి తాము పోరాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ హోదా గురించి బలంగా వాదన వినిపించని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు భిన్నంగా.. ఆ పార్టీ ఎంపీ మాత్రం పదిహేనేళ్లు ప్రత్యేక హోదా గురించి పోరాడతానని చెప్పటం ఏందో..?