ఓట్ల కోసమే టీడీపీ ‘కడప ఉక్కు’రాగం..

Update: 2018-06-20 07:47 GMT
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 48 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్ష రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాచమల్లు దీక్షకు  రాష్ట్రవ్యాప్తంగా నేతలు మద్దతు తెలుపుతున్నారు. దీక్షలో రాచమల్లు టీడీపీ దొంగనాటకాలపై మండిపడ్డారు. నాలుగేళ్లు మాట్లాడకుండా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఉక్కురాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు.

టీడీపీవీ అన్ని ఓట్ల కోసం చేసే దీక్షలేనని రాచమల్లు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడేందుకు టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తానని  ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగితే ఉద్యోగాలు వస్తాయని.. యువతకు ఉపాధి లభిస్తుందని.. అందుకే మొదటి నుంచి వైసీపీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.

టీడీపీ నేతలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రేమ లేదు. అందుకే ఆయన కేటాయించిన పనులను కూడా చేసేందుకు మోకాలడ్డుతున్నారని రాచమల్లు విమర్శించారు. అందుకే జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతలు - రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు కుంచెం సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. చాలా మంది నేతలు వచ్చి రాచమల్లు వెంట నడుస్తున్నారు.
Tags:    

Similar News