నోరు మూసుకునే కన్నా.. చావడం మిన్న: పీవీపీ

Update: 2020-06-25 06:47 GMT
వైసీపీ నేత, టాలీవుడ్ నిర్మాత పీవీపీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎందుకు చేశారు? ఆ సందర్భం ఏంటి అనేది పేర్కొనలేదు. కానీ తాజాగా ఓ భూవివాదంలో హైదరాబాద్ లో కేసు నమోదైన సందర్భంగా ఆయనీ ట్వీట్ చేశారని పలువురు భావిస్తున్నారు.

ఇంతకీ పీవీపీ చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న’ అని తప్పును ప్రశ్నించినందుకు తనకు ఏం అయినా కానీ ఎదురిస్తూనే ఉంటానని.. నోరు మూసుకొని కూర్చోను అని స్పష్టం చేసినట్టైంది. ఇది ఎవరిని ఉద్దేశించి ఇలా స్పందించారన్నది ఆసక్తి రేపుతోంది.

పీవీపీ హైదరాబాద్ లో ఓ వివాదంలో తాజాగా చిక్కుకున్నారు. తన ఇంటి నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంటే పీవీపీ తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశాడని విక్రమ్ కైలాష్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పీవీపీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ స్టేషన్ లో ప్రశ్నించారు. గురువారం ఉదయం కూడా రావాలని ఆదేశించారు.

ఈ వివాదంపై పీవీపీ కూడా స్పందించారు. తాను విల్లాలు విక్రయించినప్పుడు ఎలాంటి రూఫ్ టాప్ ల నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో ఉందని.. కానీ అక్రమంగా నిర్మిస్తున్నందుకే కూల్చేశానని తెలిపారు.
Tags:    

Similar News