పెడనలో ఊహించని పంచాయతీ
ఇటీవల అనూహ్య పరిణామాల నేపథ్యంలో వార్తల్లోకి వచ్చిన కృష్ణా జిల్లా పెడన పంచాయతీ మరో మారు ఆసక్తికరమైన వివాదాలతో తెరమీదకు వచ్చింది. ఇటీవల అధికారంలో చేజిక్కించుకున్న వైసీపీ - ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మధ్య ఆధిపత్యపోరు ముదురు పాకాన పడుతోందని అంటున్నారు. ఇటీవల జరిగిన అధికార మార్పిడి నేపథ్యంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యలో అధికారులు నలిగిపోతున్నారని అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహి తలపడేంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరికొకరు హెచ్చరికలు చేసుకున్నారు.
వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ కు మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సోదరుడు రామమూర్తికి మధ్య వాగ్వివాదం తీవ్ర స్థాయిలో జరిగింది. పంచాయతీలోని 3వ వార్డులో డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి పని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సమక్షంలోనే వీరిరువురు దూషించుకున్నారు. కొబ్బరికాయ కొట్టే విషయంలో వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది. ప్రొటోకాల్ పాటించటం లేదంటూ చైర్మన్ ప్రశ్నించటంతో వివాదం నెలకొంది. దీంతో నువ్వేంతంటే.. నువ్వేంతంటూ సవాళ్లు విసురుకున్నారు. ఇలా ఉండగా వీరిద్దరి గొడవకు ముందు మున్సిపల్ కమిషనర్ గోపాలరావుతో కూడా మున్సిపల్ చైర్మన్ కు వివాదం చోటుచేసుకుంది. వీరిద్దరి మధ్య కూడా వాగ్వివాదం తీవ్ర స్థాయిలో జరిగింది. శ్రీ పైడమ్మ సంబరాలకు బ్యానర్లు ఏర్పాటు చేసే విషయంలో ప్రొటోకాల్ అంశం దీనికి కారణమైంది. ప్రతి దానికీ తనను అవమానిస్తున్నారంటూ చైర్మన్ పై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువగా మాట్లాడవద్దని చైర్మన్ అనగా మీకంటే నేను ఎక్కువగా మాట్లాడగలను అని కమిషనర్ సమాధానమిచ్చారు. ఏదైనా ఉంటే ఛాంబర్ లో మాట్లాడుకుందామని చైర్మన్ అన్నారు. ఈ రెండు గొడవలను ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు - ముఖ్య ప్రజాప్రతినిధులు చూస్తూ ఉండిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/