టూ వీక్స్ ఆపరేషన్.. కిడ్నాపైన పారిశ్రామిక వేత్త కుమారుడు దొరికాడు కానీ..!
అవును... ఝార్ఖండ్ లోని టాటానగర్ లో గల అదిత్యపుర్ చిన్న పరిశ్రమల సంఘం ఉపాధ్యక్షుడు దేవాంగ్ గాంధీ కుమారుడు కైరవ్ (24) రెండువారాల క్రితం కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే.;
ఓ పారిశ్రామిక వేత్త కుమారుడిని కిడ్నాప్ చేయడం.. ఓ విదేశీ నెంబర్ వాట్సప్ నుంచి కిడ్నాపర్లు మెసేజ్ లు చేయడం.. ఈ సందర్భంగా రు.5 కోట్లు ఇవ్వకపోతే మీ కుమారుడిని చంపేస్తామని బెదిరించడం.. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం కావడం.. దీనిపై జంషెడ్ పూర్ సిటీ ఎస్పీ కుమార్ శివశిష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడటం జరిగిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఝార్ఖండ్ లోని టాటానగర్ లో గల అదిత్యపుర్ చిన్న పరిశ్రమల సంఘం ఉపాధ్యక్షుడు దేవాంగ్ గాంధీ కుమారుడు కైరవ్ (24) రెండువారాల క్రితం కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జవనరి 13న కారులో వెళ్తున్న అతడిని దుండగులు వెంబడించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కైరవ్ ని కిడ్నాప్ చేశామని విదేశీ ఫోన్ నంబరుతో అతడి తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ లు పంపించారు. ఈ సందర్భంగా.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు.
దీంతో... దేవాంగ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సమయంలో జంషెడ్ పూర్ ఎస్పీ కుమార్ శివాశిష్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన సిట్.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడానికి కనీసం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో... జార్ఖండ్, బీహార్, ఒడిశా అంతటా అనుమానిత రహస్య స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ శివాశిష్... కైరవ్ ను సురక్షితంగా రక్షించి, మంగళవారం తెల్లవారుజామున ఇంటికి పంపినట్లు తెలిపారు.
నిరంతర దాడులు, ఒత్తిడి కారణంగా కిడ్నాపర్లు బాధితుడిని వేరే ప్రదేశానికి తరలించే ప్రయత్నంలో వదిలి వెళ్ళాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వెలువడిన అధికారిక ప్రకటనలో... పోలీసుల ఒత్తిడి పెరగడంతో, నేరస్థులు హజారీబాగ్ లోని చౌపరాన్ - బర్హి రహదారిపై కైరవ్ ను వదిలి పారిపోయారు అని వెల్లడైంది. ఈ ఘటనలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు ప్రారంభించబడ్డాయని అధికారులు తెలిపారు.
కాగా... కిడ్నాప్ జరిగిన రాత్రి సెరైకేలా - ఖర్సవాన్ జిల్లా పరిధిలోని చండిల్ లోని కందర్ బెడ వద్ద ఉన్న ఒక రిసార్ట్ సమీపంలో కైరవ్ కారును గుర్తించిన పోలీసులు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో తూర్పు సింగ్ భూమ్, సెరైకేలా – ఖర్సవాన్ జిల్లాల పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్ పాల్గొన్నారు. ఈ సంఘటన నగర వ్యాపార వర్గాలలో ఆందోళన కలిగించిందని చెబుతున్నారు. రెండు వారాల ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు!