అత్యంత సున్నిత అంశాలను టచ్ చేస్తున్న జగన్... తన నిర్ణయాలే తనకు శత్రువు!
``వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను ఎవరూ ఓడించలేరు. ఆయనను ఓడించే నాయకులు ఇంకా పుట్టలేదు``- ఇదీ.. హార్డ్ కోర్ వైసీపీ నాయకులు.. జగన్ అభిమానులుగా ఉన్న మంత్రులు పదే పదే చెప్పేమాట. దీనిపై గతంలో ఎప్పుడూ.. పెద్దగా చర్చ జరగలేదు. కానీ,.. ఇటీవల రెండు వారాలుగా మాత్రం ఈ మాటపైనా.. ఈ ధీమాపైనా.. రాజకీయ మేధావులు దృష్టి పెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. ప్రజలు ఆవేదన చెందుతున్న తీరును వారు చర్చిస్తున్నారు. దీంతో ``నిజమే! జగన్‌ను ఎవరూ ఓడించలేరు. అసలు ఓడించే ప్రయత్నం కూడా చేయలేరు. కానీ, జగన్ తనంతట తనే చిత్తుగా ఓడిపోతారు!!`` అని మేధావులు స్పష్టం చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలోనూ.. పోస్టులు పెడుతున్నారు.
ఇంతకీ మేధావులు అంటున్న మాటేంటంటే.. ఏ ప్రభుత్వమైనా.. ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా.. ప్రజల మనోభావాలతో.. సునిశిత అంశాలతో..మరీ ముఖ్యంగా ఓటు బ్యాంకుతో ముడిపడిన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే.. ఎంత ప్రజాభిమానం ఉన్నప్పటికీ.. వారి మనోభావాలను కనుక ఒక్కసారి బాధ పెడితే.. ప్రజలు జీవిత కాలం గుర్తుంచుకుంటారు. అది మున్ముందు.. శరాఘాతమై. సదరు పార్టీని, నేతలను కూడా వెంటాడుతుందని మేదావులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండవచ్చు. దీనివల్లపేదలకు అంతో ఇంతో లబ్ధి కలుగుతూ.. ఉండొచ్చు. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మాత్రం లబ్ధి చూకూరలేదు.
పైగా.. ఇప్పుడు అదే ప్రజల మనోభావాలు దెబ్బతినేలా.. జగన్ చేస్తున్న పనులు.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని మేధావులు చెబుతున్నారు. ఉదాహరణకు చెత్తపై పన్ను. ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రభుత్వాల నుంచి కూడా ఉన్నదే. కానీ.. ఇది నేరుగా ప్రజలపై ప్రభావం చూపే అంశం. అందుకే.. ఏ ప్రభుత్వమూ.. దీనిని పట్టించుకున్నది లేదు. అమలు చేసింది కూడా లేదు. ఈ జాబితాలో వైఎస్ కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు.. జగన్ తగుదునమ్మా.. అంటూ.. ప్రజల నుంచి చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఈ పన్నును అమలు చేయకపోవడం గమనార్హం. ఇది .. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న మాట వాస్తవం.
ప్రజలు ఇప్పటికి రూ.30, రూ. 50 చొప్పున కడుతున్నా.. మనసులో మాత్రం జగన్ పోవాలనే అనుకుంటున్నారని మేధావులు చెబుతున్నారు. ఇక, మరోకీలక విషయం.. అత్యంత కీలకమైన మాస్ ఓటు బ్యాంక్ పై తీవ్ర ప్రభావం చూపించే విషయం.. ఓటీఎస్. వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద.. పేదలకు దాదాపు 4 దశాబ్దాల కిందట కొన్ని ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు రగిలిపోతున్నారు. కట్టేదిలేదని భీష్మిస్తున్నారు. అయితే.. పింఛన్లు కట్ చేస్తామని.. రేషన్ కార్డులు తీసేస్తామని.. ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ తిరుగుబాటు సైతం వచ్చే అవకాశం ఉందని.. మేదావులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జగన్‌ను చిత్తుగా ఓడించేందుకు.. ఈ రెండు అంశాలు చాలని.. దీనికి ప్రతిపక్షాలు కూడా ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అహంకారానికి పోయిన.. అనేక ప్రభుత్వాలు.. కుప్పకూలిన సందర్భాలు అనేకం ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. మరి జగన్ మారతారో.. లేదో చూడాలి.