ఆప్తుడి దగ్గరే బాబు మోసాలన్నీ చెప్పిన జగన్
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తన కార్యాచరణను వేగవంతం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఢిల్లీ వేదికగా జగన్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఆప్తుడి వద్దే ఆయన తీరుపై జగన్ కంప్లైట్ చేశారు. ఇంతకీ బాబు ఆప్తుడు ఎవరంటే... చద్రబాబు ఢిల్లీ వెళ్లినపుడల్లా కలిసే కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ. అంతకు ముందు వైఎస్ జగన్...ములాయం సింగ్ యాదవ్ - సురవరం సుధాకర్ రెడ్డి - రాజా తదితరులను కలిశారు.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక - రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన వైఎస్ జగన్ ఏపీలో చంద్రబాబు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన గురించి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, అనర్హత పిటిషన్లను పెండింగ్ లో ఉంచడమే కాకుండా మంత్రులుగా ప్రమాణం చేయించిన అంశాన్ని వివరించామని జగన్ తెలిపారు. తనకు జైట్లీ ఎంతో సన్నిహిత్యం అన్నట్లుగా బాబు ప్రవర్తిస్తుంటారని, అయితే బాబు నిజస్వరూపాన్ని అదే జైట్లీతో తాము వెల్లడించామన్నారు. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయకుండా వారికి మంత్రి పదవులిచ్చిన తీరుపై ఫిర్యాదు చేయడానికే ఢిల్లీకి వస్తే తమపై ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబులా కేసుల నుంచి తప్పించుకునే అలవాటు తనకు లేదన్నారు. తనపై పెట్టిన కేసులు కుట్రపూరితమని, తనను రాజకీయంగా అణగదొక్కాలని చేసిన కుట్ర అని జగన్ అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని వైఎస్ జగన్ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అలాంటి వ్యక్తికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.
అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల ఆవేదనను జైట్లీకి వివరించామని జగన్ తెలిపారు. హాయిల్యాండ్ లాంటి విలువైన ఆస్తులను వేలానికి రాకుండా చూస్తున్న సంగతి తెలియజెప్పామన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం పై సీబీఐ విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేశారు. వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ ...డిపాజిట్లరకు నష్టం కలిగిస్తున్నారని జగన్ ఆరోపించారు. బినామి ఆస్తులను వెలికి తీయాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కోరామని జగన్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/