పొలిటికల్ పల్స్: కూటమికే ఫేవర్!
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ పల్స్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? కూటమి సర్కారుకు ప్రజల్లో గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ పల్స్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? కూటమి సర్కారుకు ప్రజల్లో గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయంపై ఇటీవల మరోసారి ప్రభుత్వమే ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన నివేదికలు కూడా చంద్రబాబు వద్దకు చేరాయని, త్వరలోనే జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వీటిని వెల్లడించనున్నారని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌పైనా ఆయన కీలక అంశాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు చెబుతున్నట్టుగా ఎక్కడా భారీ వ్యతిరేకత అయితే లేదన్నారు. కానీ, స్వల్ప వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు. కొత్తగా ఇళ్లు ఇవ్వకపోవడం, పాత లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను కేటాయించడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక, రేషన్ కార్డుల విషయంపై మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రహం ఉంది.
అలానే.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాలను పరిష్కరిస్తే... 70 శాతం మంది ప్రజలు కూటమికే అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుల విషయంలో ప్రజలు పక్కా నమ్మకం ప్రదర్శిస్తున్నారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. జగన్‌తో పోలిస్తే.. పవన్ కల్యాణ్ పనితీరుకు, ఆయన దూకుడు మంచి మార్కులు పడ్డాయని తెలిసిందన్నారు.
ఇవే కాదు.. అధికారుల పనితీరు కూడా మెచ్చుకునేలా ఉందన్న సదరు నేత.. ఇంకా పనితీరు మెరుగు పడితే బాగుంటుందన్నారు. అలానే సంక్షేమ పథకాలపైనా ప్రజల్లో సంతృప్తి పెరుగుతోందన్నారు. దీనిని ఎవరూ తోసిపుచ్చలేరని అన్నారు. గతంలో చంద్రబాబు అభివృద్ధి నేతగా ఉన్న పేరుతో పాటు ఇప్పుడు సంక్షేమసారథిగా కూడా గుర్తింపు లభిస్తోందని అన్నారు. ఈ విషయాల్లో ఎక్కడా ఢోకాలేదని.. అయితే.. ప్రజలు కోరుకుంటున్న ఇళ్లు, రేషన్‌కార్డు.. పింఛన్ల వంటి విషయాల్లో కొంత ఆచితూచి వ్యహరిస్తే.. బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.