జగన్ యూరప్ ఫ్యామిలీ టూర్

Update: 2019-04-22 11:51 GMT
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే దేశంలో రెండు దశల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితా దేశంలో ఎన్నికల అనంతరం జగన్ అంత ప్రశాంతంగా ఎవరూ లేరేమో. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫుల్ రిలాక్స్ అవుతున్నారు. ఏపీలో ఎవరిని పలకరించినా 'ఈసారి జగనే' అంటున్ననారు. దీంతో వైసీపీ నేతలు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ రోజు సాయంత్రం జగన్ నేను మే 23వరకు రిలాక్స్ అవుతా అన్నారు. అలా అన్నట్టే టూర్ ప్లాన్ చేశారు.

జగన్ వేసవి విడిది కోసం విదేశాలకు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ టూర్ వెళ్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే యూరప్లో ఆయన టూర్ మొత్తం స్విట్జర్లాండ్‌ లో ఎక్కువగా సాగనుంది. ఐదు రోజుల పాటు స్విస్‌ లోనే టూర్ ఎంజాయ్ చేయనున్నారు. ఈ నెల 27న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. గత సంవత్సరం వేసవి విడిది కోసం కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ టూర్‌ కు వెళ్లారు. అప్పట్లో జగన్ బంగీ జంప్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఆ ఫొటో వైరల్ అయ్యింది.

ఇదిలా ఉంటే దాదాపు అన్ని పార్టీల నేతలు విదేశీ పర్యటనల్లో ఉన్నారు. ప్రజలు ఓట్లేసి రిలాక్సవుతుండగా... నేతలు టూర్లేసి రిలాక్సవుతున్నారు. ఎపుడూ లేనట్లు అత్యంత సుదీర్ఘ సమయం ఈసారి ఫలితాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. గత సారి మే 7న ఎన్నికలు జరిగితే 16న రిజల్ట్ వచ్చింది.

    

Tags:    

Similar News