జగన్ చెప్పే తీపి కబురేంటి... ?

Update: 2021-12-13 14:33 GMT
జగన్ హామీ ఇస్తే చేస్తారు అని అంతా నమ్ముతారు. ఇక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మీద కోటి ఆశలతో, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్నారు. జగన్ తమ కోరికలను నెరవేరుస్తారు అని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్న పీయార్సీ విషయంలో ఎట్టకేలకు కీలకమైన దశకు కధ చేరుకుంది.

పీయార్సీ పై నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా అందచేశారు. ఆ నివేదికలో అనేక అంశాలను పొందుపరచారు. ఫిట్మెంట్ మీద 11 ప్రతిపాదనలు కూడా చేశారని అంటున్నారు. ఇక దీని మీద జగన్ 72 గంటలలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 14.29 ఫిట్మెంట్ కి సిఫార్సు చేసినట్లుగా పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయం మీద అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా మేము ఫిట్మెంట్ ఇస్తున్నామని కూడా చెబుతున్నారు.

ఇక ఏపీలో రెవిన్యూలో 36 శాతం పైగా ఉద్యోగుల జీతం కోసమే పోతోంది అని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడో మరో విషయం ఉంది. సెంట్రల్ పే స్కేల్ ని అనుసరించి కూడా పీయార్సీ ఇస్తామని చెబుతున్నారు. మొత్తానికి అందరి కంటే ఎక్కువగానే పీయార్సీ ఇస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఉద్యోగులు కూడా జగన్ ఏమి తీఇపి కబురు చెబుతారా అని ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరి జగన్ డెబ్బై రెండు గంటల తరువాత చెప్పే ఆ స్వీట్ న్యూస్ ఏంటి. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News