73 ఏళ్ల ముసలాయన...జగన్ ఎందుకలా...?
చంద్రబాబు విషయంలో వ్యక్తిగత విమర్శలు గతంలో ఎందరో చేశారు. చేస్తూనే ఉన్నారు. ఆయన వెన్నుపోటుదారుడని, సొంత మామను ఆయనే మానసికంగా క్షోభ పెట్టడం వల్ల చనిపోయారని ఈ రోజుకీ అంటారు. ఇక బాబు అందరినీ నమ్మించి మోసం చేస్తారు అని కూడా విమర్శలు చేస్తారు. ఇవన్నీ చాలా కాలంగా అందరూ అంటున్నవే వింటున్నవే.
కానీ ఫస్ట్ టైం బాబు ఏజ్ ని పట్టుకుని రాజకీయ విమర్శలు చేయడం మాత్రం కొంత ఆశ్చర్యంగానే ఉంది. బాబు పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రి జగన్ ఈ కామెంట్స్ చేశారు. డెబ్బై మూడేళ్ళ ముసలాయనను చూస్తే రెండే రెండు స్కీమ్స్ గుర్తుకువస్తాయి. ఒకటి వెన్నుపోటు, రెండవది మోసం అని ఆయన నర్శీపట్నం మీటింగులో సెటైర్లు వేశారు.
బాబు విషయంలో గతంలో జగన్ చాలా విమర్శలు చేశారు కానీ ఏజ్ మాత్రం ఎపుడూ తీసుకురాలేదు. మరి ఎందుకు ఇలా ఆయన మాట్లాడారు అన్నది కూడా చర్చకు వస్తోంది. పైగా కరెక్ట్ గా లెక్క కట్టి మరీ డెబ్బై మూడు అంటూ జనాల ముందు చెప్పడంతో ఆంతర్యం ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచించేలా ఉంది.
జగన్ ఇలా ఎందుకు అన్నారూ అంటే దాని వెనక ఒక వ్యూహం ఉంది అంటున్నారు. నిజానికి గత ఎన్నికల కంటే ముందు ఎన్నికలలో అంటే 2014 టైం లో జగన్ ఒక మాట వాడేవారు. తాను యువకుడిని అని తాను యువ పాలన తెస్తాను అని. అప్పటికి బాబు వయసు అరవైలు దాటింది. జగన్ నలభైలోపు ఉన్నారు. అయితే అపుడు అనుభవం పేరిట బాబు దాన్ని మార్చుకుని అధికారం సంపాదించారు.
ఇక 2019లో ఏజ్ ఫ్యాక్టర్ ఏదీ జగన్ తీసుకురాలేదు. పైగా తన పాలన చూడాలని ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరుకున్నారు. జనాలు కూడా ఇచ్చారు. ఇపుడు చూస్తే 2024 ఎన్నికలలో మరోసారి చంద్రబాబు అనుభవం కార్డు తీస్తున్నారు. పాలన జగన్ కి చేతకావడంలేదు అని జిల్లాల టూర్లలో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దాంతో జగన్ కూడా ప్రతివ్యూహాన్ని రూపొందించారు అని అంటున్నారు.
అందుకే ఆయన ఎపుడూ చేసే వెన్నుపోటు మోసం విమర్శలకు తోడుగా బాబు ఏజ్ ని కూడా గుర్తు చేస్తూ ఏడున్నర పదుల ముసలాయన అని నొక్కి గట్టిగా చెప్పారని అంటున్నారు. బాబు ఇంత ముదిమి వయసులో ఉన్నారని చెప్పడమే జగన్ మాటల వెనక అంతరార్ధం అని అంటున్నారు. బాబు ఏజ్డ్ అయ్యారని, ఆయన ఎన్నికల వేళకు 75 దాకా వస్తారని, అలాంటి వయో వృద్ధుడి చేతిలో ఏపీని పెడితే భారం ఆయన మోయగలరా అన్న చర్చను జనంలో పెట్టి ఆ విధంగా బాబు ఏజ్ నే మైనస్ పాయింట్ గా చేయాలన్నదే జగన్ వేస్తున్న సరికొత్త ఎత్తుగడ అని అంటున్నారు.
నిజానికి చూస్తే దేశంలో రాజకీయ నాయకుల ఏజ్ ఎపుడూ ఎన్నికల అంశం కాలేదు. అది మైనస్ కూడా కాలేదు. వాజ్ పేయి దాదాపు ఎనిమిది పదుల వయసులో దేశానికి ప్రధాని అయ్యారు. అలాగే మన్మోహన్ సింగ్ కూడా ముదిమి వయసులోనే దేశ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాబు ఈడు వారే. ఆయన మూడవసారి ప్రధాని కోసం పోటీ పడబోతున్నారు.
మరి కళ్ల ముందు ఇవన్నీ ఉండగా బాబు ఏజ్ ఫ్యాక్టర్ టీడీపీకి మైనస్ అవుతుందా అన్న చర్చ అయితే ఉంది. మరో వైపు చూస్తే బాబు ఏజ్ ఏడున్నర పదులు అన్నది టెక్నికల్ అంశమని ఆయన ఈ రోజుకీ చాలా మంది యువకుల కంటే కూడా సమర్ధుడిగా ఉంటారని కూడా అంటారు. చూసేవారు కూడా అలాగే భావిస్తూంటారు. మరి బాబును ముసలి వారిగా చూపించే వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.