గెలుపు మీద జగన్ బ్యాచ్ ధీమా ఎంతంటే?
పోటాపోటీగా.. నువ్వానేనా? అన్నట్లు ఎన్నికలు జరిగినప్పుడు తుది ఫలితం మీద అంతులేని ఉత్కంట వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకు భిన్నమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసి దాదాపు నెల రోజులు దగ్గర పడుతున్న వేళ.. గెలుపు మీద వైఎస్సార్ కాంగ్రెస్ కు క్లారిటీ వచ్చేసింది. ఓట్ల లెక్కింపు తంతు పూర్తి కావటమే తప్పించి.. జగన్ కాబోయే ముఖ్యమంత్రి అన్న భావన అంతకంతకూ పెరుగుతోంది.
జగన్ అభిమానులు.. కార్యకర్తలు.. నేతల్లోనే కాదు.. వారి వైరిపక్షమైన టీడీపీ కార్యకర్తల్లోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం కావటం గమనార్హం. ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్న వేళ.. జగన్ పార్టీకి చెందిన కొందరు నేతల అభిమానులు చేస్తున్న పనులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నది దాదాపుగా కన్ఫర్మ్ అయిన వేళ.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి పదవులు రానున్నాయి? అన్నదిప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. కొందరు నేతల అభిమానగణం తమ నాయకుడికి ఫలానా పదవి వస్తుందన్న ప్రచారాన్ని చేసుకోవటం ఎక్కువైంది.
తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభానును కాబోయే మంత్రిగా పేర్కొంటున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్ సిస్తోంది. మిగిలిన వారికి భిన్నంగా.. ఉదయభాను అభిమానులు ఆయన్ను కాబోయే మంత్రివర్యులంటూ ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. ఇక.. జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్.. మరో అడుగు ముందుకేసి.. మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు. వీటి పై ఉదయభానును.. కాబోయే మంత్రి అన్న స్టిక్కర్లను అంటించటం గమనార్హం. తుది ఫలితం రాకుండా ఈ ప్రచారం ఏమిటన్న మాట కొందరి నోట వినిపిస్తుంటే.. గెలుపు మీద ఉన్న ధీమానే దీనికి కారణమని ఉదయభాను అభిమానులు సర్దిచెబుతున్నారు. అంతా ఓకే కానీ.. ఇలాంటి ముందస్తు ప్రచారాలు.. మంత్రి పదవి తమకు పక్కా అంటూ ప్రచారం చేసుకోవటం జగన్ ఇష్టపడతారా? అన్నది ప్రశ్న. ఎందుకైనా మంచిది సాధినేనివారు ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.