ఆన్లైన్ లో క్లాసులు , ఫెయిల్ అవుతావన్న టీచర్లు , ఆత్మహత్య చేసుకొన్న యువతి !
కరోనా మహమ్మారి విజృంభణతో లాక్ డౌన్ అమల్లోకి తీసుకురావడంతో విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న కొందరు టీచర్లు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకువచ్చి మీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి జాగ్రత్త అంటూ భయపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆన్ లైన్ పాఠాలు అర్థంకాక సతమతం అయ్యింది. ఎక్కడ ఫెయిల్ అవుతానో అని బయపడి ఆత్మహత్య చేసుకుంది. అయితే , ఆ అమ్మాయి ఓ సందర్భంలో స్టేజ్ పై మాట్లాడి సీఎం చేతనే శభాష్ అనిపించుకున్న విద్యార్థి కావడం గమనార్హం. మొత్తంగా ఆన్లైన్ క్లాసుల దెబ్బకి మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది.
వివరాల్లోకి వెళ్తే .. తమిళనాడులోని శివగంగై సమీపంలోని సెల్లప్పనందల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సత్యమూర్తి కుమార్తె సుభిక్ష, అనే అమ్మాయి మదురైలో 10వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో మార్చి 25వ తేదీ నుంచి సుభిక్ష చదువుతున్న స్కూల్ మూతపడింది. అప్పటి నుంచి సుభిక్ష ఇంటి దగ్గరే చదువుకుంటున్నది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కారణంగా సుభిక్ష చదువుతున్న స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నది. ఇంటి దగ్గర ఉంటున్న సుభిక్ష కొంత కాలం నుంచి ఆన్ లైన్ లో క్లాసులు వింటుంది. అయితే స్కూల్ టీచర్లు చెబుతున్న ఆన్ లైన్ పాఠాలు అర్థంకాక పోవడంతో సుభిక్ష కొన్నిరోజులు గా ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంది.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న టీచర్ల తో మాట్లాడిన సుభిక్ష సార్ ఈ పాఠాలు తనకు అర్థం కావడం లేదని చెప్పింది. నువ్వు ఇలాగే ఉంటే 10వ తరగతి పాస్ కావడం చాలా కష్టం అని, నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని చెప్పారని తెలిసింది. దీనితో ఒత్తిడితో మరింత ఆందోళన చెందిన సుభిక్ష రాత్రి తల్లిదండ్రులు నిద్ర పోతున్న సమయం లో ఇంటి లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో తెలివితేటలు ఉన్న సుభిక్ష ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, సాటి విద్యార్థులు, స్థానికుల తో పాటు ప్రభుత్వ పెద్దలు షాక్ అయ్యారు. 2017లో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ శతాబ్ధిఉత్సవాలు నిర్వహించింది. ఆరోజు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారుల సమక్షంలో బహిరంగ సమావేశంలో ప్రసంగించిన సుభిక్ష తన స్పీచ్, తెలివితేటలతో అందర్ని కట్టిపడేసింది . అలాగే నీట్ రాసే విద్యార్థులు కూడా తమిళనాడులో ఎక్కువమంది ఆత్మహత్యకి పాల్పడుతుండటం అందరిని ఆందోళనకి గురిచేసింది.