యువ ఎంపీ అత్త, మాజీ మంత్రి భార్య సొంత గ్రామంలో ఓటమి!

Update: 2021-02-22 11:30 GMT
పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నారు. దిగ్గజ ఎంపీ, మాజీ మంత్రుల కుటుంబ సభ్యులను సైతం ప్రజలు పరిగణలోకి తీసుకోకుండా ఓడిస్తుండడం విశేషంగా మారింది.టీడీపీ శ్రీకాకుళం యువ ఎంపీ రామ్మోహన్ నాయుడికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆయన సొంత అత్త.. ఆమె సొంత గ్రామంలో చిత్తుగా ఓడిపోవడం టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేసింది.

విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు పంచాయతీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.విశాఖ జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం బండారు సత్యనారాయణ స్వస్థలం. గతంలో బండారు సత్యనారాయణ భార్య మాధవీలత రెండు సార్లు ఆ గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆమె అక్కడి నుంచే పోటీచేశారు.

అయితే మాజీ మంత్రి భార్యపై వైసీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు గెలిచారు. ‘నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఈ పంచాయతీ పోరులో మాధవీలత పై అప్పారావు ఏకంగా 464 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలోని మొత్తం 10 వార్డులను వైసీపీ మద్దతుదారులే గెలుపొందడం విశేషం.మాజీ మంత్రి భార్య, శ్రీకాకుళం ఎంపీ అత్తను ఓడించి టీడీపీకి ఆ గ్రామస్థులు గట్టి షాక్ ఇచ్చారు.
Tags:    

Similar News