ఫ్లైట్ లో రచ్చ చేస్తున్నోడిని సీటుకు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి కట్టేశారు
ఇది చదివే వారులో చాలామంది ఎన్నోసార్లు విమాన ప్రయాణాలు చేసి ఉండొచ్చు. కానీ.. మీరెప్పుడు వినని.. చూడని ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. విమానంలో ఎంత రచ్చ చేసినా.. శాంతంగా భరించటం.. సర్ది చెప్పటం.. ప్రయాణం పూర్తి అయ్యే వరకు ఓపికగా వ్యవహరించటం.. ఒక్కసారి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అప్పటివరకు రచ్చ చేస్తున్నోడికి ‘సినిమా’ చూపించటం తెలిసిందే. అందుకు భిన్నంగా విమానంలో సినిమా చూపించిన వైనం తాజాగా చోటు చేసుకుంది. సీటుకు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసేసిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అతిగాళ్లకు ఈ తీరులోనే షాకివ్వాలన్న భావన కలిగేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..
ఫిలడెల్ఫియా నుంచి మియామీకి వెళుతుందో విమానం. అందులో 22 ఏళ్ల మాక్స్ వెల్ బెర్రీ అనే యువకుడు ప్రయాణిస్తున్నాడు. మిగిలిన ప్రయాణికులకు పూర్తి తేడాగా వ్యవహరిస్తున్న ఇతగాడు.. మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలకు పంటి బిగువునా భరించారు. అక్కడితో ఆగని అతగాడు.. తాకరాని చోట తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో.. చుట్టూ ఉన్న ప్రయాణికులు అతడి తీరును తప్పు పట్టారు.
అంతే.. అప్పటివరకు వెకిలి చేష్టలకు పాల్పడిన అతడు.. తనను తప్పు పడుతున్న వారిపై యుద్ధానికి దిగాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. తన తీరుతో రచ్చ రచ్చ చేయటమే కాదు.. విమాన ప్రయాణం చేస్తున్న వారికి ఆందోళన కలిగించే రీతిలో వ్యవహరించసాగాడు. అతడికి ఎంత చెప్పినా వినకపోగా.. అందరిని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో విమాన సిబ్బంది అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు.
అతడ్ని విమాన సిబ్బంది ఒకరు బలంగా దొరకబుచ్చుకోగా.. మరొకరు అతడు కూర్చున్న సీటుకే టేపు సాయంతో కట్టేశారు. మాట్లాడకుండా నోటికి టేప్ చుట్టేశారు. ఆ యువకుడ్ని కట్టేస్తున్న సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులుపడిన ఆనందం చూస్తే.. అతగాడి రచ్చ ఏ స్థాయిలో ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది. ఈ ఉదంతాన్ని పలువురు తమ సెల్ ఫోన్ తో వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. ఈ ఉదంతం వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే.. తనను సీటుకు కట్టేసిన సిబ్బంది చర్యను తప్పు పడుతూ.. ‘నన్ను కాపాడండి’ అంటూ అరుస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది.తోటి ప్రయాణికులపై దాడికి యత్నం.. విమాన సిబ్బందితో అనుచిత ప్రవర్తన లాంటి నేరాలకు పాల్పడిన ఇతడ్ని విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దరిద్రపుగొట్టు ప్రవర్తనకు సరైన రీతిలో బుద్ధి చెప్పారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Frontier passenger allegedly touched 2 flight attendants breasts, then screamed his parents are worth $2 million, before punching a flight attendant. Frontier suspended the crew for duct taping the passenger to his seat as they landed in Miami. 22 yr old Max Berry is in custody. pic.twitter.com/4xS9Rwvafx
— Sam Sweeney (@SweeneyABC) August 3, 2021