ఢిల్లీ సీఎం తీసుకొచ్చిన ''ఎల్లో'' ఆంక్షలు ఎలా ఉండనున్నాయి?

Update: 2021-12-29 04:34 GMT
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టేసి.. మహమ్మారి చీడ దేశానికి వదిలినట్లేనని అభిప్రాయపడుతున్నవేళ.. ఆ సంతోషాన్ని ఏ మాత్రం లేకుండా చేసేలా.. ‘ఒమిక్రాన్’ వచ్చి పడింది. కరోనా ఫ్యామిలీ లో.. ఇప్పటివరకు విస్తరిస్తున్న అన్ని వేరియంట్ల కంటే మహా వేగంగా విస్తరించే గుణం ఒమిక్రాన్ సొంతం. ఈ మాయదారి వేరియంట్ ఇప్పటికే పలు దేశాల్ని ఉక్కిరి బిక్కిరి పెడుతోంది. కొద్ది రోజుల క్రితమే మన దేశం లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ వేరియంట్.. ఇప్పుడు మన దేశం లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది.

దీనికి సరైన సమయం లో సరైన రీతి లో చెక్ పెట్టకుంటే.. జరిగే నష్టం అంతా ఇంతకాదు. ఈ విషయాన్ని గుర్తించిన ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందస్తుగా నియంత్రణ చర్యల్ని చేపట్టారు. ఢిల్లీ రాష్ట్రం లో పాజిటివిటీ రేటు 0.5 కంటే ఎక్కువ గా ఉంటోందని.. ఇప్పటి వరకు 165 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్టును తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు 2 నుంచి మూడు శాతం నుంచి 25-30 శాతానికి పెరిగిందన్నారు. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ 1ను ప్రకటించినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధి లో 331 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశం లోని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంటే.. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో మొత్తం 167 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఢిల్లీ రాష్ట్రం లో 165 కేసులు.. కేరళలో 57.. తెలంగాణలో 55.. గుజరాత్ లో 49 కేసులు.. రాజస్థాన్ లో 46 కేసులు ఉన్నాయి.

ఎల్లో ఆంక్షల అమల్లో ఏమేం పరిమితుల్ని అమలు చేస్తారంటే?

పూర్తిగా మూసివేయాల్సినవి..

- సినిమా హాళ్లు
- మల్టిప్లెక్స్‌లు
- జిమ్‌లు
- ఇన్‌డోర్‌ యోగా కేంద్రాలు
- స్టేడియాలు
- స్విమ్మింగ్‌ పూల్స్‌
- స్కూళ్లు
- విద్యాసంస్థలు
- కోచింగ్‌ సంస్థలు
అనుమతులు ఉండేవి ఇవే..
- అవుట్‌డోర్‌ యోగా
- సెలూన్లు
- బ్యూటీపార్లర్లు
- పార్కులు

ప్రయాణాలకు సంబంధించిన పరిమితులు

- ఢిల్లీ మెట్రో రైల్‌లో 50 శాతం ప్రయాణికులకే అనుమతి ఉంటుంది. నిల్చొని ప్రయాణించకూడదు.
- బస్సులను 50ు సామర్థ్యంతో నడుపుతారు.
- ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకే అనుమతి
ఇతర పరిమితులు
- రాజకీయ, మతపరమైన, సామాజిక పరమైన సామూహిక కార్యక్రమాలు, సభలపై బ్యాన్
- హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతి
- బాంకెట్‌ హాళ్లు, కాన్ఫరెన్స్‌ హాళ్లకు అనుమతి రద్దు
- ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది
- ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరి-బేసి పద్దతిలో మాల్స్.. షాపుల్ని తెరుస్తారు
- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తారు
- పెళ్లిళ్లు.. అంత్య్రియలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి
Tags:    

Similar News