కీల‌క స‌మ‌యంలోనూ కునుకా... వైసీపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం...!

Update: 2021-12-08 10:33 GMT
ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. నిజానికి అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ లు చేస్తున్నా.. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షం చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో తాజాగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రెండు కీల‌క ప‌థ‌కాలు..కూడా ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

వీటిలో ఓటీఎస్ ఒక‌టైతే.. రెండోది చెత్త‌పై ప‌న్ను. ఈ రెండు విష‌యాలు కూడా చాలా సున్నిత‌మైన‌వి కావ‌డంతో ప్ర‌జ‌ల్లో ప్ర‌తిప‌క్షం చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారం జోరుగా దూసుకుపోతోంది. చెత్త‌పై ప‌న్ను అనేది వాస్త‌వానికి ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది.

ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు హ‌యాంలోనే దీనిని తెర‌మీదికి తెచ్చారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షాల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతోపాటు.. ఎన్నిక‌లుస‌మీపిస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గారు.

అలాంటి దానిని ఇప్పుడు జ‌గ‌న్ అమ‌ల్లో పెట్టారు. కానీ, ప్ర‌చారం మాత్రం వ్య‌తిరేకంగానే సాగుతోంది. మ‌రో వైపు ఓటీఎస్ కూడా ప్ర‌జ‌ల‌కు త‌మ ఇళ్ల‌పై సంపూర్ణ హ‌క్కుల‌ను క‌ల్పించేదే. దీంతో ఇప్ప‌టివర‌కు ఎవ‌రూ సాహసించ‌ని విధంగా జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు.

అయితే.. దీనిని కూడా ప్ర‌తిప‌క్షం వ్య‌తిరేక కోణంలోనే ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. దీంతో ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ప‌క్క‌కు పెట్టేలా.. వైసీపీ నాయ‌కులు.. ప్ర‌భుత్వ ఉద్దేశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం లేదనే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. క‌నీసం.. మంత్రులు కానీ.. నాయ‌కులు కానీ.. ఎమ్మెల్యేలు కానీ.. ఎవ‌రూ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు.. వాటి అమ‌లుపై ప‌ట్టు సంపాయించుకోవ‌డం లేద‌నే వాద‌న కొన్ని నెల‌లుగా వినిపిస్తూనే ఉంది.

ఇప్పుడు కీల‌క‌మైన ఓటీఎస్‌ప‌థ‌కంపైనా..దీనిపై పేద ప్ర‌జ‌ల్లో నెల‌కొన్ని సందేహాలు.. భ‌యాలు.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వంటివి ఎదుర‌వుతున్నా కూడా.. నాయ‌కులు క‌ద‌ల‌క‌పోవ‌డంపై వైసీపీ అభిమానుల్లో విస్మ‌యం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు ముందుకు క‌దులుతారా? లేదా? చూడాలి.


Tags:    

Similar News