బాల‌య్య స‌మ‌క్షంలో.. టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు!

Update: 2021-02-15 16:30 GMT
టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ స‌మ‌క్షంలో వైసీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు తెలుగుదేశం పార్టీలో చేరారు. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. మొదటిరోజు పర్యటనలో భాగంగా హిందూపురం పట్టణంలోని టీడీపీ నాయకుల పిల్లలను కలిశారు బాల‌య్య‌.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌రకూ రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. రెండు దశల్లోనూ అధికార పార్టీ పూర్తిస్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రతిపక్షాలకు చెప్పుకోదగ్గ స్థానాలు కూడా రాలేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా కనీస స్థాయిలో సర్పంచ్ లను గెలుచుకోలేకపోయింది.

17వ తేదీన మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా.. ఇప్పటికే 85 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఈ దశలోనూ అధికార పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము కూడా ప్రభావం చూపాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే బాలకృష్ణ హిందూపురంలో ప‌ర్య‌టిస్తున్నారు. త్వ‌ర‌లో మునిసిప‌ల్ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతుండ‌డంతో నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా వైసీపీకి మద్దతిస్తున్న ప‌లువురు టీడీపీలో చేరారు.
Tags:    

Similar News