రాబోయే ఉద్యోగాలు ఇక ఇంటినుంచే..

Update: 2019-06-11 07:00 GMT
పొద్దున్నే లేచి చక్కగా కాపీ/టీ పెట్టుకొని తాగుకుంటూ కంప్యూటర్ ముందేసుకొని అలా ల్యాన్ లో పచ్చగడ్డి మధ్యన పనిచేసుకుంటే ఎలా ఉంటుంది.. అబ్బా ఆ సుఖమే వేరు కదా..కానీ నేటి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి.. ఇంటి నుంచి ట్రాఫిక్ లో గంటా రెండు గంటలు ఆఫీసుకు బయలు దేరి అక్కడ గొడ్డులా పనిచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రయ్యి అలసిసొలసి బజ్జోవడానికే సరిపోతోంది.. అదే ఇంటినుంచే పనిచేస్తే ఎంత ప్రశాంతతో పాటు ఎంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు హోంవర్క్ అదే ఇంటినుంచే పనిచేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు ఓ సర్వేలో తేలింది.

తాజాగా ఉద్యోగాలు చూపించే పోర్టల్ ‘షైన్ డాట్ కామ్’ నిర్వహించిన సర్వేలో మూడు వంతుల మంది ఆఫీసులకు వెళ్లి  ఉద్యోగాలు చేసే కన్నా.. ఇంటినుంచే పనిచేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. 22 నుంచి 30 ఏళ్ల లోపు యువత ఇదే అభిప్రాయం చెప్పుకొచ్చింది. 70శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తూ తాము అద్భుతంగా సృజనాత్మకతతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

నాలుగు గోడల మధ్య పనిచేస్తే కష్టమని.. స్వేచ్ఛగా పనిచేస్తేనే అద్భుతమైన ఐడియాలు వస్తాయని 60శాతం మంది అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్, ప్రయాణ ఖర్చులు కలిసివస్తాయని.. సమయం ఆదా అవుతుందని.. ఇంటి నుంచి పని వల్ల ఉద్యోగులు కూడా ఆ సంస్థకు విధేయుడై పనిచేస్తారని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేస్తే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందని స్పష్టం చేశారు.

ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా పనిచేయడం పట్ల సంతృప్తి కలుగుతుందని హార్వర్డ్ బిజినెస్  స్కూల్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఇంటి నుంచి పని చేయడం వల్ల తమ కర్తవ్యాన్ని పరిపూర్ణం చేయగలమని అభిప్రాయపడ్డారు. ఇక ఇంటి నుంచే పనిచేస్తే ఎప్పుడు ఎక్కడ  ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియక ఆందోళనకు గురి అవుతామని కొందరు వ్యతిరేకించారు.

    

Tags:    

Similar News