ప్రధాని మాటను రికార్డుల్లో నుంచి తొలగిస్తూ వెంకయ్య నిర్ణయం
పాత తరం రాజకీయ నేతల వాసనలు కొట్టే ఉప రాష్ట్రపతి వెంకయ్య తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీ మాట్లాడిన మాటను రికార్డుల నుంచి తొలగించాలన్నఅరుదైన నిర్ణయాన్ని తీసుకోవటం విశేషంగా మారింది. రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకయ్య.. ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలోని ఒక పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాజ్యసభ సెక్రటేరియట్ తీసుకుంది.
సభకు నాయకుడిగా.. అందునా ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న వారు చేసే ప్రతి మాటకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. విపక్ష నేతల మాటల్ని రికార్డుల నుంచి తొలగించటం చాలా మామూలైన విషయం. అందుకు భిన్నంగా ప్రధాని చేసిన వ్యాఖ్యల్లోని పదాల్ని రికార్డుల్లో నుంచి తొలగించటం చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే అంశంగా చెప్పక తప్పదు.
గురువారం రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన ఆవేశ పూరిత ప్రసంగంలో ఒక మాటను రికార్డుల నుంచి తొలగించాలని వెంకయ్య నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ఆరున రాజ్యసభలో సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్యలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో ఒక పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారని రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది.
సభ జరిగిన రోజుల్లో.. సభ పూర్తి అయ్యాక సభ్యులు చేసే వ్యాఖ్యల్ని పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించాల్సిన మాటలకు సంబంధించిన నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ తీసుకుంటారు. ఇది రోటీన్ వ్యవహారమే అయినప్పటికీ.. ప్రధాని చేసిన వ్యాఖ్యల్లోని మాటను తీసేయటం మాత్రం చాలా అరుదుగా జరిగేదిగా చెబుతున్నారు. సభా గౌరవానికి భంగం వాటిల్లేలా ఉన్నా.. సభ విలువలకు తగినట్లుగా ఉండదని భావించినా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే.. ప్రధాని మోడీ మాట్లాడిన ఏ పదాన్ని రికార్డుల నుంచి తొలగించారన్న విషయం మీద మాత్రం వివరాలు వెల్లడించలేదు.