• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో ఐఏఎస్ అధికారులకు...

ఏపీలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు.. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం

| రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By - Tupaki Political Desk
Update: 2026-03-29 06:54 GMT

రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఆ జిల్లాలకు ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్న అధికారులను బదిలీ చేశారు. కొందరికి పదోన్నతులు కల్పించి కొత్త పోస్టుల్లో నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని సీఎస్ వెల్లడించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ను బదలి చేసి, ఆయన స్థానంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్ ను నియమించారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ గా సమర్థంగా పనిచేస్తు ప్రభుత్వ అభినందనలు అందుకున్న తమీమ్ అన్సారియాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా నియమించారు. గుంటూరు కలెక్టర్ గా సి.ఎం. సాయికాంత్ వర్మ ను నియమించారు.

ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరుగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌ నిశాంతికి పదోన్నతి కల్పించారు. ఇక ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్న సగిలి షాన్ మోహన్ ను ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) సీఈఓగా నియమించారు. అదేవిధంగా అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ను ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి స్థానంలో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. కొత్తవారిని నియమించే వరకు ఆ జిల్లా కలెక్టర్ కే జేసీగా ఎఫ్.ఎ.సి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వం చేపట్టిన తాజా బదిలీలు విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యమైన జిల్లాలకు కలెక్టర్లను మార్చడం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా విశాఖ, గుంటూరు కలెక్టర్లను మార్చడమే చర్చకు కారణమవుతోంది. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న విశాఖకు హదీంద్ర ప్రసాద్ కలెక్టరుగా ఉన్నారు. ఆయనను మార్చి వేరొకరికి బాధ్యతలు అప్పగించడం వెనుక పరిపాలన కారణాలు ఉన్నాయా? లేక వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు గుంటూరు కలెక్టరుగా రాజధాని ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న తమీమ్ అన్సారియాను తప్పించారు. అయితే ఆమెకు అంతకంటే కీలకమైన బాధ్యత అప్పగంచడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు

Tags:    
  • apiastransfers 
  • newcollectorsap 
  • visakhapatnamcollector 
  • gunturcollector 
  • andhrapradeshnews 

Similar News

పాకిస్తానీ న‌టీన‌టుల‌ను వెంటాడుతున్న ఆప‌రేష‌న్ బొమ్మాళీ

2026-11-25 12:54 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

2026-11-25 12:50 GMT

అక్కడి నుంచే పోటీ.. ఆ నియోజకవర్గమే ఎందుకు? కవిత నిర్ణయం వెనుక అసలు కథేంటి?

2026-11-25 12:42 GMT

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

పింకీ సార్ పింకీ అంతే.. దీని ముందు బాహుబలి బర్రెలన్నీ పక్కకు బలాదూర్

2026-11-25 10:11 GMT

అమెరికాలో పదేళ్లు ఉంటే గ్రీన్‌కార్డా? లక్షలాది వలసదారులకు ఊరటనిచ్చేలా డెమోక్రాట్ల కొత్త బిల్లు

2026-11-25 10:10 GMT

కోర్టు విచారణ ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తే అంతే సంగతలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

2026-11-25 10:09 GMT

భార‌తీయ యువ‌కుడిని ర‌ష్య‌న్ ఆర్మీలో చేర‌మ‌ని బ‌ల‌వంతం చేసారా?

2026-11-25 09:04 GMT

Copyright @2026

Powered by Blink CMS