దసరా ఉత్సవాల్లో లేడీ బౌన్సర్లు!

Update: 2016-10-01 09:52 GMT
దసరా పండగ సందర్భంగా ముంబైలోని వివిధ దేవాలయాల వద్దనవ రాత్రి ఉత్సవాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ ఉత్సవాలకి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చిన భక్తులు - దాండియా ఆటలు ఆడే మహిళలు - యువత సందడితో దేవాలయాల ప్రాంగణాలు కిక్కిరిసిపోతుంటాయి. అయితే దాండియాలో పాల్గొనేందుకు వచ్చినవారు, చూడ్డానికి వచ్చే వారితో ఒక్కోసారి తొక్కిసలాటలు - తోపులాటలు కూడా చేసుకుంటుంటాయి. అయితే, అలాంటి అవాంఛనీయ ఘటనల్ని అరిక‌ట్టేందుకు ఇప్పుడు లేడీ బౌన్సర్లని  ముంబైలోని కొన్ని దేవాలయ కమిటీలు నియమించుకుంటున్నాయి.

భులేశ్వర్‌ లోని ముంబదేవి దేవాలయ కమిటీ కూడా దాదాపు 50 మంది మెన్‌ - ఉమెన్‌ బౌన్సర్లని నియమించుకుంది. వీళ్లే కాకుండా ఇంకొంతమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ప్రతినిత్యం దాదాపు లక్ష మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారిని అందరినీ ఈ లేడీ బౌన్సర్ల సహాయంతో నిలువరించ గలుగుతున్నామ‌ని దేవాలయం మేనేజర్‌ హేమంత్‌ జాదవ్ తెలిపారు. దాండియా క్వీన్‌ ఫాల్గుని పాఠక్‌ పాల్గొనబోయే దాండియా ఈవెంట్‌ వద్ద కూడా లేడీ బౌన్సర్లని నియమించారు. లేడీ బౌన్సర్ల సహాయంతో వారిని నిలువరిస్తున్నామ‌ని శ్రీయ ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీ ప్రతినిధి శేఖర్‌ రామచందన్‌ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News