బిచ్చగత్తె.. ఒక్క పాటతో జాతీయ సెలబ్రెటీ

Update: 2019-08-21 11:38 GMT
సుడి - అదృష్టం.. ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదంటారు. ఇక్కడా అలానే జరిగింది. బిచ్చమెత్తుకోవడానికి ఆ మహిళ పాడిన పాట ఇప్పుడు ఆమె బతుకునే మార్చేసింది. ఆ ఒక్క పాటతో సెలబ్రెటీని చేసి ఏకంగా వరుస అవకాశాలు కల్పించింది. బిచ్చగత్తె నుంచి ఇప్పుడు జాతీయ సెలెబ్రెటీగా మారిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా కృష్ణానగర్ కు చెందిన మహిళా  మారియా ఘనత ఇదీ..

59ఏళ్ల మరియా.. ఓ బిచ్చగత్తె. బిక్షమెత్తుకోవడానికి ఆమె రోజు పశ్చిమ బెంగాల్ లోని నోయిడా జిల్లా రాణాఘాట్ రైల్వే స్టేషన్ కు వచ్చేది. దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటినుంచి నడిచి వచ్చి అడుక్కునేది. స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై పాటలు పాడుతూ అభ్యర్తించేది. ఇలా సంవత్సరాలుగా చేస్తున్న ఆమెను ఎవరూ గుర్తించలేదు. జూన్ 21న ఈమె గొంతు విన్న అక్కడే కూర్చున్న అతీంధ్ర చక్రవర్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ అయ్యింది.చాలా మంది వీడియోను షేర్ చేయడంతో జాతీయ సెలబ్రెటీ అయిపోయింది.

బిచ్చగత్తెగా ఇన్నాళ్లు జీవించిన ఆమె ఒక్కపాటతో జాతీయ సెలెబ్రెటీగా మారిపోయింది.  నిన్నామొన్నటి దాకా రైల్వే ఫ్లాట్ ఫామ్, వీధుల్లో పాటలు పాడుతూ బతికిన ఆమెకు ఇప్పుడు పాటలు పాడాలంటూ సినిమాలు, రియాల్టీ షోల నుంచి పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్నాయట. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ కూడా ఆఫర్ ఇచ్చినట్టు మారియా తెలిపింది. పలువురు రేడియో చానెళ్లు, సినీ నిర్మాతలు, స్థానిక క్లబ్ లు కూడా పాడే అవకాశాలు ఇస్తున్నాయట.. విమాన టికెట్లు బుక్ చేసి మరీ ఈమెను తీసుకెళ్లి పాడిస్తున్నారు.

మారియా జీవితం చిన్నప్పటి నుంచి కష్టాల మయం.. తల్లి చనిపోవడంతో అత్తమ్మ దగ్గర పెరిగింది. 20 ఏళ్లు ఉన్నప్పుడు క్లబ్బుల్లో ఆర్కెస్ట్రా  బృందంతో కలిసి పాడింది. అందరూ ఈమెను ‘రాణుబాబీ’ అని ఈమె గొంతును గుర్తించి పిలిచేవారట..  ఈ తర్వాత పరిస్థితులు దిగజారి ఎవరూ పట్టించుకోక ఇలా వృద్ధాప్యంలో 59 ఏళ్ల వయసులో బిచ్చగత్తెగా మారింది. కానీ తన కళ అయిన పాటలను వదలలేదు. అదే ఇప్పుడు ఆమెకు మళ్లీ పునర్జన్మనిచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ను కల్పించింది.


Full View

Tags:    

Similar News