నిమ్మగడ్డ నుంచి ఆ ఇద్దరినీ జగన్ కాపాడుతాడా?

Update: 2021-01-27 08:40 GMT
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డతో ఫైట్ పెట్టుకున్న ఏపీ సీఎం జగన్ చెప్పినట్టు విన్న అధికారులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. జగన్ సర్కార్ అండగా ఉందన్న ధీమాతో బిజినెస్ రూల్స్ ను కూడా పక్కనపెట్టి మరీ ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయాలను ధిక్కరించారు. అయితే ఇప్పుడు మొత్తం అధికారం ఆయన చేతిలోకి పోవడంతో ఇద్దరు కీలక అధికారులను అభిశంసన చేశాడు నిమ్మగడ్డ.

తాజాగా ఎస్ఈసీ అభిశంసనకు గురైన ఇద్దరు అధికారులు ద్వివేది, గిరిజా శంకర్ లను ఎన్నికలు ముగిశాక కాపాడుతామని జగన్ సర్కార్ ఇస్తున్న హామీ వాస్తవరూపం దాల్చడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిమ్మగడ్డ తీసుకున్న అభిశంసన నిర్ణయంతో ఇద్దరు ఐఏఎస్ అధికారుల కెరీర్ పై బ్లాక్ మార్క్ పడడం ఖాయం. వీరు ఇద్దరు భవిష్యత్తులో కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ వెళ్లలేరు. ప్రమోషన్లకు ఇబ్బందులే.. ఏడాది వరకు వీరికి కష్టాలు తప్పవు.

అభిశంసన తర్వాత ఈ ఇద్దరు అధికారులపై చర్యలు ఉపశమనం కలిగించాలని కేంద్రం జోక్యం చేసుకొని ఈ మధ్య తొలగిస్తే తప్ప వీరికి తిరిగి డిప్యూటేషన్లు, ప్రమోషన్లు ప్రయోజనాలు లభించవు.

ఇక జగన్ సర్కార్, మంత్రి పెద్దిరెడ్డి నిమ్మగడ్డ చర్యల నుంచి అధికారులను కాపాడుకుంటామని తెలిపింది. ఎన్నికల కోడ్ ముగిసిపోయాక వారిపై నిమ్మగడ్డ రమేశ్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు సాధ్యమన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News