సీఎం జగన్ హైదరాబాద్ ట్రిప్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యిందెందుకు?

Update: 2020-11-26 09:30 GMT
అవును.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. అది కూడా.. ఆఖరి నిమిషాల్లో. అప్పటివరకు హైదరాబాద్ కు బయలుదేరేందుకు సిద్ధమైన వేళ.. చివర్లో భద్రతా సిబ్బంది సూచన మేరకు జగన్ తన హైదరాబాద్ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంతకీ.. ఆయన హైదరాబాద్ కు ఎందుకు రావాలని అనుకున్నారు? అన్న విషయంలోకి వెళితే..

బుధవారం రాత్రి హైదరాబాద్ లో చాలానే పెళ్లిళ్లు జరిగాయి. కానీ.. ఒక పారిశ్రామికవేత్త ఇంట్లో జరిగిన వివాహంతో పాటు.. మీడియాకు సంబంధించి కీలకమైన వ్యక్తి ఇంట్లో జరిగిన పెళ్లి అందరి నోట నానాయి. ఈ రెండు పెళ్లిళ్లకు ఏపీ సీఎం జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. సదరు పారిశ్రామికవేత్త ఇంట పెళ్లి ఎంత ముఖ్యమో.. జగన్ సొంత మీడియా సంస్థ సాక్షిలో అత్యున్నత స్థాయిలో ఉండే ఒక సీనియర్ పాత్రికేయుడి ఇంట్లో జరిగే వివాహానికి హాజరు కావాల్సి ఉంది.

అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం అమరావతి నుంచి బయలుదేరి.. మళ్లీ రాత్రి పది గంటల సమయంలో హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లిపోయేలా జగన్ షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే.. అనుకోనిరీతిలో నిపర్ తుపాను కారణంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో హెలికాఫ్టర్ లో ప్రయాణం ఏ మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. దీంతో..ఆయన తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. అయితే.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన తన ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News