మోడీ పై ఎందుకింత వ్యతిరేకత?
సాధారణంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన సాగించాక జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. తర్వాతి ఎన్నికల్లో మళ్లీ గెలిచినా సరే.. సీట్లు తగ్గుతాయి. కానీ నరేంద్ర మోడీ సర్కారు విషయంలో అలా జరగలేదు. ఐదేళ్ల పాలనలో వైఫల్యాలున్నా సరే.. ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తూ మరోసారి మంచి మెజారిటీతో గెలిపించారు. ఇంకో ఐదేళ్లు పరిపాలనకు అవకాశమిచ్చారు.
ఐతే ప్రతిపక్షం రోజు రోజుకూ బలహీన పడుతున్న నేపథ్యంలో తనకు తిరుగులేదని, మరో పర్యాయం అధికారం దక్కుతుందని మోడీ ధీమాతో ఉండొచ్చు కానీ.. ఆయన పాలన పట్ల జనాలు అంత సంతృప్తిగా అయితే లేరన్నది స్పష్టం. డీమానిటైజేషన్ సహా కొన్నేళ్లలో వైఫల్యాలకు లోటు లేకపోయినా మన్నిస్తూ వచ్చిన జనాలు.. కరోనా వేళ మోడీ సర్కారు వైఫల్యాన్ని మాత్రం సీరియస్‌గానే తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ చూసి మోడీ మురిసిపోతూ ఉండేవారు. కానీ ఆ సోషల్ మీడియానే ఇప్పుడు మోడీని భయపడుతోంది. ఆయన్నుంచి ఏ అప్ డేట్ వచ్చినా.. దానికి స్పందించే తీరులో జనాలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. మామూలుగా మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమానికి చక్కటి స్పందన ఉంటుంది. కానీ లేటెస్ట్ ఎపిసోడ్‌కు యూట్యూబ్‌లో ఏకంగా పది లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ఇది ప్రతిపక్ష కుట్ర అని తీసి పడేయడానికి వీల్లేదు.
జనాలు కామెంట్ల రూపంలో కూడా తమ వ్యతిరేకతను చూపిస్తే.. కామెంట్ల సెక్షన్‌ను డిజేబుల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలన్న మోడీ సర్కారు నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంకా పలు నిర్ణయాల విషయంలో జనాలు ఆగ్రహంతో ఉన్నారు. కరోనా వేళ తమకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఓదార్పు లభించట్లేదని.. రోజు రోజుకూ పరిస్థితులు దిగజారుతున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా-లాక్ డౌన్ కారణంగా కోట్లల్లో ఉద్యోగాలు పోయాయి. రోజు వారీ పనుల్ని నమ్ముకునే వారికి ఉపాధి పోయింది. ఆర్థికంగా దారుణంగా నష్టపోయారు. ఇంకా అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. ఈ స్థితిలో ప్రజల్ని ఆదుకునేందుకు మోడీ సర్కారు చేసిందేమీ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు కానీ.. చివరికి చూస్తే అది చేతిలో పెట్టి ఐస్ గడ్డలా తరహాలో తయారైంది. జీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మైనస్ 23 శాతానికి వెళ్లిపోయింది. కరోనా కట్టడికి తగు చర్యలు కానీ.. జనాలకు సాయం కానీ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో పరిస్థితులు బాగు పడేలా లేవు. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో మోడీ పట్ల ఎన్నడూ లేనంత తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.