ఆర్ ఎస్ ఎస్ కోటలో కాంగ్రెస్ పాగా.. బీజేపీ అడ్డంగా ఓడిపోయిందే!
ఆర్ ఎస్ ఎస్ మూలాలు బలంగా ఉన్నాయంటే.. ఇక అక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కిందన్నమాటే! అందుకే.. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ముందు ఆర్ ఎస్ ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. హిందూ వర్గాన్ని సమీకరిస్తుంది. అనంతరం.. అక్కడ బీజేపీ జెండాలు లేస్తాయి. ఇదీ ఈ రెండు సంస్థల మధ్య ఉన్న ఒక ప్రధాన అవగాహన. అయితే.. ఇప్పుడు ఈ వ్యూహం కూడా చెదిరిపోయిందని అంటున్నా రు పరిశీలకులు. ఎందుకంటే.. ఆర్ ఎస్ ఎస్‌కు కంచుకోటగా ఉన్న చోట .. బీజేపీ ఓడిపోవడ మే కాదు.. కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో ఒక్కసారిగా.. బీజేపీ సహా ఆర్ ఎస్ ఎస్ ఉలిక్కిపడ్డాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆర్ ఎస్ ఎస్ హెడ్ క్వార్టర్ అయిన మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇటీవల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సీ ఎన్నికలు జరిగాయి. గత 50 ఏళ్లుగాఇక్కడ ఆర్ ఎస్ ఎస్ నిలబెట్టిన అభ్యర్థే గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా 15 వేల ఓట్లతో విజయం దక్కిం చుకుని విజయదుందుభి మోగించారు. వాస్తవానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఎన్నికల పోరు సాగింది. అయినప్పటికీ.. ఆర్ ఎస్ ఎస్ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. దీనికి ప్రదాన కారణం.. ఆర్ ఎస్ ఎస్ ప్రభావం తగ్గిందనే అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం అంతా కార్పొరేట్ సంస్కృతి వచ్చేసిన నేపథ్యంలో ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని ప్రజలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఇదే నాగపూర్‌లోనూ వర్కవుట్ అయిందని అంటున్నారు పరిశీలకులు. ఆర్ ఎస్ ఎస్ ప్రభావం లేని చోట కాంగ్రెస్ పుంజుకుందని, అదే ఆర్ ఎస్ ఎస్ ప్రబావం ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ వెనుకబడిందని చెబుతున్నారు. ఇక, ఇక్కడ జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ ఒకటి శివసేన, మరొకటి ఎన్సీపీలు ఎగరేసుకుపోయాయి. దీనిని బట్టి.. చదువుకున్న మేధావులు బీజేపీ నుంచి మెల్లగా దూరమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ జమిలి జపం చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు.. బీజేపీని ఎటు తీసుకువెళ్తాయో చూడాలని అంటున్నారు పరిశీలకులు.