ఆదేంటి రామోజీ మాస్కు వాడటం లేదా?
చిన్నా..పెద్ద అన్న తేడా లేకుండా వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు భౌతిక దూరాన్ని పాటించటం.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం తప్పనిసరి అన్నవిషయం తెలిసిందే. ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రభుత్వంతో పాటు. మీడియా కూడా ప్రయత్నిస్తుంది. మరి.. అలాంటిది మీడియా మొఘల్ గా అభివర్ణించే ఈనాడు గ్రూపుసంస్థల అధినేత రామోజీరావు ముఖానికి మాస్కు పెట్టుకోరా? అన్నది ప్రశ్నగా మారింది.
ఈటీవీ రజతోత్సవ కార్యక్రమాన్ని రామోజీ ఫిలింసిటీలో ఘనంగా నిర్వహించటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఈటీవీలో టెలికాస్టు చేశారు. ప్రముఖులే అయినప్పటికీ.. రామోజీ కుటుంబానికి చెందిన వారిలో కొద్ది మందిమినహా పలువురు అసలు బయటకే రారు. తాజాగా టెలికాస్టు చేసిన రజతోత్సవ కార్యక్రమాల కవరేజ్ లో రామోజీ కుటుంబ సభ్యులందరిని పదే పదే చూపించటం జరిగింది. తెలుగుప్రజలకు ఇది కాస్త కొత్త అనుభవంతో పాటు.. వారంతా సుపరిచితులయ్యే అవకాశం ఉందని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు ముఖానికి మాస్కు పెట్టుకోకపోవటం విస్మయానికి గురి చేసింది. అదే సమయంలో ఆయన కుమారుడు కమ్ ఈనాడు ఎండీ కిరణ్ ఆయన సతీమణి శైలజా కిరణ్ లు ముఖానికి మాస్కులు పెట్టుకోగా.. రామోజీ మాత్రం అందుకు భిన్నంగా మాస్కు పెట్టుకోకుండా కార్యక్రమం మొత్తం మామూలుగా ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారిపై భారీ ఎత్తున వార్తలు అందించే ప్రముఖ మీడియా అధినేత ముఖానికి మాస్కు లేకుండా ఉండటాన్ని ఏమనాలంటారు?