మ‌నోళ్ల‌లో క‌సి మిస్ అయ్యిందేమి కేసీఆర్‌?

Update: 2019-07-16 08:17 GMT
ఇప్ప‌టి సంగ‌తి వ‌దిలేయండి. ఉద్య‌మ రోజుల్ని గుర్తుకు తెచ్చుకోండి. టీఆర్ ఎస్ నేత‌లు ఎలా ఉండేవారు?  త‌మ అధినేత‌ను ఎవ‌రేమైనా అంటే చాలు చెల‌రేగిపోయేవారు. చిరుత‌పులిలా వెంటాడి.. వెంటాడి మ‌రీ విమ‌ర్శ‌లు చేసేవారు. మీడియా ఏదైనా వారే క‌నిపించేవారు. ఈ కార‌ణంతోనే చ‌ట్ట‌స‌భ‌ల్లో పెద్ద బ‌లం లేకున్నా టీఆర్ ఎస్ నేత‌ల్ని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో నాటి అధికార పార్టీ నేత‌లు సైతం ఒక‌టి కి రెండుసార్లు ఆలోచించేవారు.

టీఆర్ ఎస్ నేత‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌టం.. అందునా కేసీఆర్ ను ఉద్దేశించి ఏదైనా విమ‌ర్శ చేయ‌టం అంటే.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసిన‌ట్లుగా భావించే ప‌రిస్థితి ఉండేది. అందుకే ఫైర్ బ్రాండ్ పేరున్న నేత‌లు సైతం కేసీఆర్ అండ్ కో విష‌యంపై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో మాత్రం ఆస‌క్తిని చూపించేవారు కాదు.

తెలంగాణ సాధ‌న త‌ర్వాత బంగారుతెలంగాణ పేరుతో వ‌చ్చిన బీటీ బ్యాచ్ తో పార్టీలో మార్పు మొద‌లైంది. అప్ప‌టివ‌ర‌కే పార్టీకి అన్ని తామైనోళ్లంతా వెన‌క్కి వెళ్లిపోతే.. కొత్త‌గా వ‌చ్చిన బీటీ బ్యాచ్ ప్ర‌ముఖంగా క‌నిపించేవారు. దీనికి తోడు బీటీ బ్యాచ్ కే కేసీఆర్ ప్రాధాన్య‌త ఇస్తార‌న్న పేరుతో.. సంప్ర‌దాయ టీఆర్ఎస్ నేత‌లు అప్రాధాన్యంలోకి వెళ్లిపోయారు.

వ్యాపార.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి గులాబీ జెండా త‌పించే ల‌క్ష‌ణం బీటీ బ్యాచ్ లేక‌పోవ‌టం ఒక‌ప్ర‌ధాన లోపంగా చెప్పాలి. ఇక‌..పార్టీలో ప్రాధాన్య‌త‌తో పాటు.. పద‌వులు సైతం బీటీ బ్యాచ్ కే ల‌భించ‌టంతో టీఆర్ఎస్ నేత‌లు వెన‌క్కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే తెలంగాణ అధికార‌ప‌క్షానికి శాపంగా మారింది.

పార్టీ అధినేత మొద‌లు.. పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌పైన విప‌క్షాలు విరుచుకుప‌డటం కామ‌న్ అయ్యింది. స్వ‌యాన కేసీఆర్ ను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేసినా. .చ‌ప్పుడు చేసే టీఆర్ ఎస్ నేత‌లే క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఇదంతా చూస్తున్న‌ప్పుడు ఒక‌ప్పుడు పార్టీ కోసం ఎంత‌కైనా స‌రే అన్న‌ట్లు క‌సిగా ప‌ని చేసే గులాబీ బ్యాచ్ ఇప్పుడు లేదా? అన్న సందేహం క‌లిగే ప‌రిస్థితి. ఇలాంటి వైనం ఏ రాజ‌కీయ పార్టీ ఆస్తిత్వానికైనా అపాయ‌క‌ర‌మే. ఈ విష‌యాన్ని మేధావి కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. గులాబీ నేత‌ల్లో మిస్ అయిన క‌సి విష‌యంలో కేసీఆర్ ఏదో ఒక శ‌స్త్ర‌చికిత్స జ‌రిపితే త‌ప్పించి పాత క‌సి మ‌ళ్లీ వ‌చ్చేట్లు లేదు. అంత ఓపికా.. తీరికా సారు వారికి ఉందంటారా? 
Tags:    

Similar News