వాట్సాప్ చాటింగ్.. ఇద్దరిని బలితీసుకుంది..

Update: 2018-10-01 10:48 GMT
వాట్సాప్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. చిన్న అపార్థం ఇద్దరి జీవితాలను చిదిమేసింది. ఇందులో భర్త నిర్లక్ష్యం, భార్య అనుమానం.. చివరకు ఓ అమాయకపు అమ్మాయికి గుదిబండగా మారింది. ఇలా స్నేహితులిద్దరూ చనిపోయారు..

హైదరాబాద్ లోని వాల్మీకినగర్ కు చెందిన ఎలక్ట్రీషియన్ కే. శివకుమార్ (27), అదే కాలనీలో నివాసముండే చింతల వెన్నెల (19)లు చిన్ననాటి నుంచి స్నేహితులు. డిగ్రీ పూర్తి చేసిన వెన్నెల ప్రస్తుతం ఓ సంస్థలో మార్కెటింగ్ జాబ్ చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ అక్కడి స్థానికులకు తెలుసు.

ఇక శివకుమార్ కు ఇటీవలే ఆగస్టు 15న దూలపల్లికి చెందిన లహరీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి శివకుమార్ లహరితో ఎక్కువ సమయం గడపకుండా వాట్సాప్ లో చాట్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇది గమనించిన లహరీ భర్త ఫోన్ చెక్ చేయగా.. వెన్నెలతో చాటింగ్ బయటపడింది. దీంతో భార్య లహరి ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి రచ్చ చేస్తానని శివకుమార్ ను బెదిరించింది. అలా చేస్తే చస్తానని.. చెప్పొద్దని బతిమిలాడిన శివకుమార్ .. ఈ అవమానం భరించలేక ఫ్యాన్ కు ఉరివేసుకొని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక శివకుమార్ మృతికి తనే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మనస్తాపం చెందిన వెన్నెల ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా సోమావారం మృతిచెందింది. ఇలా వాట్సాప్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది..
    

Tags:    

Similar News